GaandeevaDhaari Arjuna: ఆ ముగ్గురిలో ఈ వీకెండ్ విన్నర్ ఎవరు..?

GaandeevaDhaari Arjuna

ఆగస్టు 25న ముగ్గురు యువ హీరోల సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో రూపొందిన గాండీవదారి అర్జున, కార్తికేయ నటించిన బెదురులంక 2012, దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న కాంగ్ ఆఫ్ కోత సినిమాలు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. గని లాంటి ఘోర డిజాస్టర్ తర్వాత వరుణ్ కొంత గ్యాప్ తీసుకొని గాండీవదారి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కెరీర్లో మొదటిసారి రా ఏజెంట్ గా కనిపించిన వరుణ్ కి ఈ సినిమా హిట్ అవ్వటం కీలకం అని చెప్పాలి. ఇటీవలే రిలిజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ కి డీసెంట్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో సినిమాపై ఆసక్తి నెలకొంది.

మొదటి సినిమా ఆరెక్స్ 100తోనే బ్లాక్ బస్టర్ అందుకొని అందరి దృష్టిని ఆకట్టుకున్న కార్తికేయ, ఆ తర్వాత చెప్పుకోదగ్గ హిట్ లేక సతమతం అవుతున్న నేపథ్యంలో కామెడీ బ్యాక్డ్రాప్ లో రూపొందిన బెదురులంక సినిమా ద్వారా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ట్రైలర్ ద్వారా పెద్దగా ఆసక్తి క్రియేట్ చేయలేకపోయిన ఈ సినిమాలో కామెడీ వర్కౌట్ అయితే తప్ప ఆశించిన ఫలితం దక్కే అవకాశం లేదు.

మహానటి, సీతారామం సినిమాల ద్వారా బ్లాక్ బస్టర్స్ అందుకొని తెలుగు ఆడియెన్స్ కి దగ్గరవటమే కాకుండా పాన్ ఇండియా వైడ్ క్రేజ్ సంపాదించిన డుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న కింగ్ ఆఫ్ కోత సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే రిలీజ్ అయ్యి సినిమాపై అంచనాలు పెంచింది. మరి, ఈ వీకెండ్ బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న యంగ్ హీరోస్ లో విన్నర్ ఎవరో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు