Varun Tej: ఈ బజ్ తో బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా..?

Varun Tej

వరుణ్ తేజ్ హీరోగా డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో తెరకెక్కిన గాండీవదారి అర్జున సినిమా ఆగస్టు 25న రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. గని లాంటి ఘోర డిజాస్టర్ అందుకున్న తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న వరుణ్ తేజ్ ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వరుణ్ కెరీర్లో ఎఫ్2, ఎఫ్3 లాంటి రొటీన్ కమర్షియల్ హిట్స్ తప్ప చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్స్ లేవు. డిఫరెంట్ స్టోరీస్ ని సెలెక్ట్ చేసుకుంటున్నప్పటికీ కమర్షియల్ గా సక్సెస్ లేని వరుణ్ తేజ్ ఈ సినిమా మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నాడు. ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో బజ్ క్రియేట్ కాలేదు. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ బాగానే ఉన్నప్పటికీ సినిమా మీద ఆసక్తి పెంచలేకపోయింది.

సుమారు 50కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకి ఆ రేంజ్ లో హైప్ అయితే క్రియేట్ కాలేదనే చెప్పాలి. ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నప్పటికీ హీరోకి గతంలో గని వంటి డిజాస్టర్ ఉండటం, సరైన హిట్ లేని ప్రవీణ్ సత్తారు డైరెక్టర్ కావటం వల్ల సినిమా మీద నామమాత్రపు అంచనాలు కూడా ఏర్పడలేదు. పైగా ఇటీవల మెగాఫ్యామిలీ నుండి వచ్చిన బ్రో, భోళాశంకర్ సినిమాలు కూడా అంచనాలు తలకిందులు చేసిన నేపథ్యంలో మెగా అభిమానుల్లో నెలకొన్న నిరాశ కూడా ఇందుకు కారణం అని చెప్పాలి.

వరుణ్ తేజ్ రా ఏజెంట్ గా కనిపించిన ఏ సినిమాకు ఫస్ట్ షో కి డీసెంట్ టాక్ సొంతం చేసుకోవటం కీలకం అని చెప్పాలి. ఆగస్టు 25న పెద్ద సినిమాలేవీ రిలీజ్ లేకపోవటం ఈ సినిమాకి కలిసొచ్చే అంశం అనే చెప్పాలి. ఫస్ట్ షోతో యావరేజ్ టాక్ సొంతం చేసుకున్నా కూడా మౌత్ టాక్ తో ఫాస్ట్ వీకెండ్ ముగిసేసరికి డీసెంట్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. మరి, బడ్జెట్ కి తగిన బజ్ క్రియేట్ కాని ఈ సినిమా ఏ మేరకు అలరిస్తుందో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు