Dulquer salmaan comments on rana: రానా పై దుల్కర్ సల్మాన్ కామెంట్స్ వైరల్

Dulquer salmaan comments on rana

దుల్కర్ సల్మాన్.. పేరుకి మలయాళం హీరో అయిన తెలుగు ప్రేక్షకుల్లో ఈ హీరోకి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. గతంలో డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన దుల్కర్ సల్మాన్, మహానటి, సీతారామం సినిమాలతో తెలుగు హీరోల లిస్ట్ లోకి చేరిపోయాడు. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా వైడ్ క్రేజ్ సంపాదించుకున్న దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ గా కింగ్ ఆఫ్ కొత్త సినిమాతో ఈ ఆగస్ట్ 24న ప్రేక్షకుల ముందుకి రానున్నాడు.

భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ కింగ్ ఆఫ్ కొత్త సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ఇటీవలనే హైదరాబాద్ లో జరగగా, ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా నాచురల్ స్టార్ నాని, రానా దగ్గుబాటి హాజరయ్యారు. కాగా ఈ ఈవెంట్ లో రానా దగ్గుబాటి దుల్కర్ సల్మాన్ గురించి మాట్లాడుతూ బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ పై  పరోక్షంగా పలు విమర్శలు చేసాడు. దాంతో ఈ వ్యాఖ్యలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. అందరు రానా చేసిన ఆ వ్యాఖ్యల గురించే మాట్లాడుతుండటంతో హీరోయిన్ సోనమ్ కపూర్ కూడా రానా కామెంట్స్ పై పరోక్షంగానే స్పందించింది. దాంతో ఈ వివాదం హైలెట్ అయింది. ఇలాగే చూస్తూ ఉంటే ఈ వివాదం అనవసరమైన చర్చలకు దారి తీస్తుందని గమనించిన రానా వెంటనే ఈ ఇష్యు పై స్పందిస్తూ ట్విట్టర్ లో దుల్కర్ సల్మాన్ కు సోనమ్ కపూర్ కు క్షమాపణలు తెలిపాడు.

ఇక లేటెస్ట్ గా కింగ్ ఆఫ్ కొత్త సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్న దుల్కర్ సల్మాన్ ను రానా వ్యాఖ్యలపై యాంకర్ ప్రశ్న అడగగా దుల్కర్ సల్మాన్ స్పందిస్తూ..  నేను వాటిపై మాట్లాడాలనుకోవట్లేదు. అవి పూర్తిగా రానా వ్యక్తిగత వ్యాఖ్యలు. నాకు ఇండస్ట్రీలో చాలా మంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో రానా కూడా ఒకరు. నేను ఎవరిపై కంప్లైంట్ చేయను. నా పని నేను చేసుకొని వెళ్ళిపోతాను. రానా ఆ విషయాన్ని కావాలని అయితే చెప్పి ఉండరు. స్టేజిపైకి వచ్చాక నా గురించి మాట్లాడుతూ అలా చెప్పారు. అందుకే ఆయన తర్వాత క్షమాపణలు కూడా చెప్పారు అని అన్నారు. అయితే ఈ కామెంట్స్ బట్టి చూస్తే మాత్రం దుల్కర్ సల్మాన్, రానా ను దుల్కర్ సల్మాన్ కాస్త విమర్శినట్టే తెలుస్తోంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు