King of kotha: రానా అడిగాడు.. ఐశ్వర్య చేస్తుందా?

Rana’s speech about King of Kota movie

మలయాళం బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి వరుస సినిమాల్తో దూసుకుపోతుంది. కేరళకి చెందిన ఈ అమ్మాయి గ్లామర్ రోల్స్ కాకుండా యాక్టింగ్ ప్రిఫరెన్స్ ఉన్న పాత్రలకే ప్రాధాన్యం ఎక్కువ ఇస్తుంది. అందువల్ల పెద్దగా స్టార్ డమ్ లేకపోయినా మంచి టాలెంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది. ఇక ఈ హీరోయిన్ లాస్ట్ ఇయర్ మట్టి కుస్తీ తో మంచి హిట్ అందుకోగా, ఈ ఇయర్ పొన్నియిన్ సెల్వన్ తో పలకరించగా, ఇప్పుడు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించిన “కింగ్ ఆఫ్ కోత” లో హీరోయిన్ గా ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

తాజాగా కింగ్ ఆఫ్ కోత తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి నాని, రానా గెస్ట్ లుగా హాజరయ్యారు. ఇక రానా మాట్లాడుతూ చిత్ర యూనిట్ కి తన బెస్ట్ విషెష్ ని అందచేసాడు. ఇక హీరోయిన్ ఐశ్వర్య గురించి చెప్తూ, ఐశ్వర్య లాంటి హీరోయిన్ ఉండడం ఫిల్మ్ మలయాళం ఇండస్ట్రీ అదృష్టం అని అన్నాడు. ఇక హీరోయిన్ ఐశ్వర్యని త్వరలో తెలుగులో కూడా సినిమాలు చేయమని రానా రిక్వెస్ట్ చేస్తూ అడిగాడు. స్టేజి మీదే ఉన్న ఐశ్వర్య తప్పకుండా చేస్తానని బదులిచ్చింది.

అయితే ఐశ్వర్య లక్ష్మి ఇంతకు ముందే తెలుగులో గాడ్సే, అమ్ము అనే సినిమాల్లో నటించింది. కానీ ఆ సినిమాలు అంతగా ఆడకపోవడంతో పెద్దగా ఆడియన్స్ కి తెలియలేదు. కానీ ఇక ముందు ఐశ్వర్యలక్ష్మి తెలుగు సినిమాల్లో రెగ్యులర్ గా కనిపించబోతుందని సమాచారం. ఇక తాను నటించిన కింగ్ ఆఫ్ కోత ఆగష్టు 24న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు