OK Bangaram: దుల్కర్ నటించిన ఆ సినిమాకి నాని డబ్బింగ్ చెప్పాడని తెలుసా!

Nani dubbed for Dulquer starrer Oke Bangaram

మలయాళం టాలెంటెడ్ ఆక్టర్స్ లో ఒకరైన దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముందుగా డబ్బింగ్ సినిమాలతో పరిచయమైనా, తెలుగులో చేసిన మహానటితో టాలీవుడ్ లోను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక లాస్ట్ ఇయర్ సీతారామం సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టడమే గాకుండా, ఒక తెలుగు నటుడు అన్న రేంజ్ లో ఇక్కడ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ఇక తాజాగా ఈ హీరో కింగ్ అఫ్ కోత అనే సినిమాలో నటించాడు.

దుల్కర్ సల్మాన్ రౌడీగా మాస్ రోల్ చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా యొక్క తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నాని, రానా గెస్ట్ లుగా హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్ లో నాని మాట్లాడుతూ దుల్కర్ తో నా పరిచయం ఒకే బంగారం సినిమా నుండి ఉంది అని అన్నాడు. అయితే ఆ దుల్కర్ సల్మాన్ నటించిన ఆ సినిమాకి నానికి సంబంధం ఏంటి అని సినిమా చూడని కొంతమంది అనుకుంటున్నారు.

మణిరత్నం దర్శకత్వం వహించిన ఒకే బంగారం లో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించగా, నిత్యా మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తెలుగులోను రిలీజ్ అయి మంచి హిట్ అయింది. అయితే ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ కి నాని డబ్బింగ్ చెప్పడం జరిగింది. ఆ విషయాన్నే నాని కింగ్ అఫ్ కోత లో గుర్తుచేశాడు. ఇక దుల్కర్ నటించిన “కింగ్ ఆఫ్ కోత” సినిమా ఆగష్టు 14న రిలీజ్ అవుతుంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు