KingOfKotha: “కోత”కి వారసుడొచ్చేసాడు.. ఇక భీభత్సమే!

King of Kota trailer released

దుల్కర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కింగ్ ఆఫ్ కోత ట్రైలర్ వచ్చేసింది. లాస్ట్ ఇయర్ “సీతారామం” తో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ హీరో ఈ సంవత్సరం ఒక ఊర మాస్ సినిమాతో వస్తున్నాడు. అదే “కింగ్ ఆఫ్ కోత”. ఈ సినిమాపై దుల్కర్ ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ లోను భారీ అంచనాలు ఉన్నాయి. దానికి కారణం దుల్కర్ ఫస్ట్ టైం ఒక మాస్ సినిమాతో వస్తున్నాడు. అందులోను ఈ సినిమాలో దుల్కర్ రౌడీ గా కనిపిస్తున్నాడు. ఇంతకు ముందు రిలీజ్ చేసిన టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా, తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా అదిరిపోయింది.

కథ నేపథ్యం విషయానికొస్తే కోత అనే ఏరియా చుట్టూనే ఈ సినిమా మొత్తం తిరుగుతుంది. ఇక దుల్కర్ సల్మాన్ ఒక రౌడీ కొడుకు. తన తండ్రిలాగే ఒక రౌడీ అవ్వాలన్న పిచ్చి కోరికతో జులాయిగా తిరుగుతుంటాడు. అదీగాక అక్కడున్న పరిస్థితులు కూడా తనని రౌడీ గా మారుస్తాయి. కోత ఏరియా పై కొంతమంది బిజినెస్ మ్యాన్స్, ఇంకా ఇతర రౌడీల కన్ను పడుతుంది. వాళ్ళ నుండి హీరో కోత ని ఎలా దక్కించుకున్నాడన్నదే కథాంశం గా చెప్తున్నారని తెలుస్తుంది.

- Advertisement -

ఇక కింగ్ అఫ్ కోత 80స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుందని సమాచారం. ఇక ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తుంది. ప్రసన్న, గోకుల్ సురేష్, అనికా సురేంద్రన్, శరన్ శక్తి, షబ్బీర్ కల్లరక్కల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఇక టీజర్ లో మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచిన బీజీమ్, ట్రైలర్ కి కూడా బాగా ప్లస్ అయింది. సినిమాలో విజువల్స్ కూడా ఆకట్టుకున్నాయి. సినిమాకి జెక్స్ బిజోయ్, షాన్ రెహ్మాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాను అభిలాష్ జోషి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను జీ స్టూడియోస్, వే ఫారెర్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక కింగ్ ఆఫ్ కోత సినిమాను ఆగష్టు24 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు