Rajinikanth: తమిళుల ఆత్మాభిమానం రజినీకి ఎక్కలేదా..?

Rajinikanth

సూపర్ స్టార్ రజినీకాంత్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కాళ్ళు ముక్కడం పట్ల జరుగుతున్న రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తనకంటే వయసులో 20ఏళ్ళ చిన్నవాడైన యోగి కాళ్ళు రజినీ తాకటం సూపర్ స్టార్ డై హార్డ్ ఫ్యాన్స్ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆత్మాభిమానికి పెద్ద పీట వేసే తమిళ నాడును రిప్రెజెంట్ చేస్తున్న రజినీకాంత్ ఇలా చేయటం తమిళ నాట రాజకీయంగా పెను దుమారం రేపింది. ఆ మధ్య పార్టీ పెట్టాలని సర్వం సిద్ధం చేసుకొని చివరి నిమిషంలో వెనకడుగు వేయటానికి కారణం బీజేపీ అంటే రజినీకి ఉన్న భయమే అని కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు యోగి కాళ్ళ మీద పడటంతో మరోసారి బీజేపీ పట్ల రజిని బానిసత్వం బయటపడిందని ప్రత్యర్థులు విమర్శల దాడి చేస్తున్నారు.

గతంలో కూడా కావేరి జలాల వివాదం సమయంలో రజినీకాంత్ వైఖరి పట్ల అటు కర్ణాటక, ఇటు తమిళనాడులో కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. రజినీకాంత్ మరాఠి కుటుంబానికి చెందినప్పటికీ పుట్టింది పెరిగింది మాత్రం కర్ణాటక లోనే, తర్వాత సినిమాల మీద ఇంట్రస్ట్ తో చెన్నై వచ్చి అక్కడే సెటిల్ అయ్యాడు సూపర్ స్టార్. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ, ఇన్నేళ్ళుగా తమిళనాట ఉంటూ, సూపర్ స్టార్ గా ఎదిగినప్పటికీ తమిళనాట పుట్టలేదు కాబట్టే ఇక్కడి వారిలోని ఆత్మాభినం, పౌరుషం వంటివి రజినీకి వంటపట్టలేదని కూడా కామెంట్ చేస్తున్నారు యాంటీ ఫ్యాన్స్.

ఏదేమైనా చాలా కాలం తర్వాత జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్న తరుణంలో సూపర్ స్టార్ మీద ఈ రేంజ్ లో విమర్శలు రావటం అభిమానులకు మింగుడు పడటం లేదు. వాతావరణం చూస్తుంటే, స్వయంగా రజినియే రంగంలోకి దిగి వివరణ ఇచ్చేదాకా ఈ విమర్శల దాడి తగ్గేలాగా లేదు. మరి, బీజేపీ పార్టీకి బద్ధవ్యతిరేకులు చాలామంది ఉన్న తమిళనాట ఎదురవుతున్న ఈ విమర్శలకు రజినీకాంత్ ఎలాంటి సమాధానం ఇస్తాడో లెట్స్ వెయిట్ అండ్ సీ.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు