Guntur Kaaram : కంటెంట్ లేనప్పుడు… కాన్ఫిడెన్స్ దేనికి- మహేష్ కౌంటర్ ?

Guntur Kaaram

హమ్మయ్య .. ! మొత్తానికి మహేష్ బాబు లేటెస్ట్ సినిమా గుంటూరు కారం గురించి మొదటిసారి మహేష్ నోరు విప్పాడు. గతకొద్ది రోజులుగా వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన ఈ సినిమా గురించి ప్రొడ్యూసర్ నాగ వంశీ స్పందించటం తప్ప.. సినిమా డైరెక్ట్ చేస్తున్న త్రివిక్రమ్ గాని, హీరోగా నటిస్తున్న మహేష్ బాబు గాని మీడియా ముఖంగా మాట్లాడింది లేదు. దాంతో ఈ సినిమాపై వస్తోన్న పుకార్లకు అడ్డు అదుపు లేకుండా పోయింది.

 

ఇక మహేష్ బాబు అభిమానుల్లో కూడా ఈ సినిమా అసలు వస్తుందా లేదా అనే అనుమానాలు తలెత్తాయి. కానీ ఈ సినిమా విషయంపై ఎన్ని రూమర్స్ వచ్చిన మూవీ టీం మాత్రం ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ చేస్తున్న పోస్టర్ లలో గుంటూరు కారం సినిమా ఖచ్చితంగా సంక్రాంతికి రిలీజ్ అవుతుందని చెబుతూ వస్తున్నారు. దాంతో మహేష్ బాబు అభిమానుల్లో కన్ఫ్యూజన్ మొదలైంది. అసలు షూటింగే జరగకుండా సినిమా ఎలా రిలీజ్ చేస్తారు. కంటెంట్ లేదు గాని కాన్ఫిడెన్స్ కు మాత్రం తక్కువలేదు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఇక లేటెస్ట్ ఈ విషయంపై మహేష్ బాబు స్పందించాడు.

- Advertisement -

బిగ్ సి మొబైల్స్ కు బ్రాండ్ అంబాసిటర్ గా కొనసాగుతున్న ఆయన కాసేపటి క్రితం బిగ్ సి మొబైల్స్ 20 ఏళ్ళు పూర్తి చేసుకోనున్న సందర్భంగా నిర్వహించిన వేడుకలో పాల్గొనున్నాడు. ప్రెస్ మీట్ లో పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాదానాలు ఇచ్చిన మహేష్ బాబు గుంటూరు కారం సినిమా గురించి విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ఎట్టి పరిస్థితుల్లో గుంటూరు కారం సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. మీరందరు చూసి ఆనంద పడతారు అంటూ చెప్పాడు. దాంతో గుంటూరు కారం సినిమాపై ఒక్క సరిగా పాజిటివిటి స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతానికైతే గుంటూరు కారం సినిమాపై మహేష్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు