Ashish 3 latest buzz: దిల్ రాజు ఫ్యామిలీ హీరో సినిమాపై సోషల్ మీడియాలో పుకార్లు

Ashish 3 latest buzz

రౌడీ బాయ్స్ సినిమాతో దిల్ రాజు ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైన ఆశిష్ రెడ్డి కొత్త సినిమాపై సోషల్ మీడియాలో పలు పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం సెల్ఫిష్ అనే సినిమాలో నటిస్తోన్న ఆశిష్, సెల్ఫిష్ సినిమా చివరి దశకు చేరుకోవడంతో ఆయన మూడవ సినిమాకు సంబందించిన పనులు కూడా మొదలైనట్టు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది.

వివరాల్లోకి వెళ్తే… రౌడీ బాయ్స్ సినిమాతో హీరోగా పరిచయమై, ప్రేక్షకులను మెప్పించిన ఆశిష్ రెడ్డి, ప్రస్తుతం సుకుమార్ శిష్యుడు విశాల్ కాశీ అనే డెబ్యూ డైరెక్టర్ దర్శకత్వంలో రాబోతున్న సెల్ఫిష్ అనే సినిమా చేస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్ మరియు దిల్ రాజు హోమ్ బ్యానరైన శ్రీ వెంటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవలనే షూటింగ్ కంప్లిట్ చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. పక్క యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా తరువాత ఆశిష్ రెడ్డి విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నట్టు సమాచారం అందుతోంది.

అయితే ఆశిష్ రెడ్డి, విక్రమ్ కే కుమార్ కాంబినేషన్ లో రాబోయే ఈ సినిమాకు ఏం ఏం కీరవాణి సంగీతం అందించనున్నాడట. అలాగే అగ్ర సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ కెమెరామెన్ గా వ్యవహరించనున్నట్టు టాక్. ప్రస్తుతం డిస్కషన్స్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ గురించి తొందర్లోనే అఫీషియల్ ఎనోన్స్ మెంట్ రాబోతున్నట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఆశిష్ కోసం దిల్ రాజు పెద్ద ప్లానింగే వేసినట్టు స్పష్టమవుతుంది. ఎలాగైన ఆశిష్ ను అగ్ర స్థాయి హీరోను చేయడానికి ప్రయత్నిస్తున్న దిల్ రాజు ప్రయత్నాలు మరీ ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు