LGM: ఇక ఇవానా ఆశలన్నీ తెలుగుపైనే?

Ivana all hopes are on Telugu?

టాలీవుడ్ లో ఒక్క సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకున్న అతి తక్కువ మంది హీరోయిన్లలో ఇవానా ఒకరు. అది కూడా డబ్బింగ్ సినిమా ద్వారా కావడం విశేషం. లవ్ టుడే అనే డబ్బింగ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తమిళ్ తో పాటు తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ కొట్టి, యూత్ క్రష్ లిస్ట్ లో జాయిన్ అయిపొయింది. అయితే ఈ భామ హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం LGM. లెట్స్ గెట్ మారీడ్ అని దాని అర్ధం.

ఇక ఈ సినిమాను ఇండియన్ గ్రేటెస్ట్ క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రొడ్యూసర్ గా మారి నిర్మించడం విశేషం. రమేష్ తమిళ్ మణి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం జులై28న రిలీజ్ అయి ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ట్రైలర్ తోనే నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ చిత్రం రిలీజ్ తరువాత రొటీన్ సినిమా అనిపించుకుంది. ఇక ఈ సినిమా తెలుగులో ఆగష్టు4 న రిలీజ్ అవుతుంది. జూలై 28నే రిలీజ్ కావాల్సి ఉండగా, “బ్రో” సినిమా పోటీ వలన వాయిదా పడింది.

అయితే ఈ సినిమా ద్వారా అందరికంటే ఎక్కువ నష్టం హీరోయిన్ ఇవానా కే జరిగిందని అంటున్నారు. అయితే ఇతర సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఇవానా వేరే ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్నందువల్ల పెద్దగా లెక్క చెయ్యట్లేదు అని నెటిజన్లు అంటున్నారు. కానీ ఏ హీరోయిన్ కైనా ఒక ప్లాప్ కూడా కెరీర్ డిసైడ్ చేస్తుంది.

- Advertisement -

ఇక LGM తో ప్లాప్ అందుకున్న ఇవానా ప్రస్తుతం తెలుగులో ఆశిష్ హీరోగా నటిస్తున్న “సెల్ఫిష్” అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగులో లవ్ టుడే తో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఇవానా ఇక్కడ మాత్రం తన క్రేజ్ ని పెంచుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే సెల్ఫిష్ సినిమాపైనే తన హొప్స్ అన్ని పెట్టుకుంది. మరి అక్కడ రాని హిట్ ఇక్కడ దక్కుతుందేమో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు