Lovetoday : ఇవానాని రిజర్వేషన్ చేసిన ఆశిష్

లవ్ టుడే సినిమాతో ఇవానా తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. తమిళ్ లో కేవలం 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ లవ్ టుడే సినిమా తమిళనాట సూపర్ హిట్ అయి దాదాపు 150 కోట్లని కలెక్ట్ చేసింది. తమిళ్లో సూపర్ హిట్ అయిన సినిమాలు తెలుగు డబ్ చేసి రిలీజ్ చేసే అలవాటు ఉన్న దిల్ రాజు లవ్ టుడే సినిమాని అదే పేరుతో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. తెలుగులో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయి మంచి కలెక్షన్స్ సాధించింది.

ప్రదీప్ రంగనాథన్ హీరోగా ఇవానా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి హీరో ప్రదీప్ రంగనాథనే దర్శకత్వం వహించారు. మొదట ఈ కథని ప్రదీప్, ధనుష్ కి వినిపించరంట కానీ ఆయన డేట్స్ లేకపోవడంతో ఈ సినిమా ధనుష్ చేయటం కుదరలేదు. వేరే హీరోలకి కూడా కథ వినిపించిన ఎవరి సినిమాలో వాళ్ళు బిజీగా ఉండటం వాళ్ళ చాలా రోజులు ఈ సినిమా పేపర్ లకే పరిమితం అయింది. ఇక ప్రదీప్ హీరోలని అందరిని పక్కన పెట్టి తానే హీరోగా చేసాడు. సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అయి ఇన్స్టంట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

హీరోయిన్ ఇవానాకి ఈ సినిమా ద్వారా మంచి పేరు వచ్చింది. వరుస ఆఫర్స్ తో తమిళ్ లో బిజీ అయిపొయింది. అయితే తమిళ్ సినిమా లతో బిజీగా ఉండటం వాళ్ళ ఇవానా తెలుగు సినిమాలు ఎక్కువ చేయటం కుదరలేదు. ప్రస్తుతం ఆమె తెలుగులో రౌడీ బాయ్స్ ఫేమ్ ఆశిష్ రెడ్డి హీరోగా వస్తోన్న “సెల్ఫిష్” సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ చివరి దశకి చేరుకుంది. ఈ సందర్బంగా ఇవానా లుక్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సినిమాలో ఇవానా చైత్ర అనే క్యారెక్టర్ లో నటిస్తుంది. “నా పోరి చైత్ర ని రిజర్వేషన్ చేసిన” అనే టాగ్ లైన్ తో యూనిట్ ఇవానా, ఆశిష్ ల పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఈ సినిమాతో విశాల్ కాశీ అనే కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడు. సుకుమార్ రైటింగ్స్ , దిల్ రాజు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పక్క యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ఈ సినిమా రాబోతుంది.

- Advertisement -

 

For More Updates :http://ivana first telugu movie

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు