Tollywood: ఎక్స్ పోసింగ్ కు నేనేం తక్కువ కాదంటున్న తెలుగు నటి

శివాత్మిక రాజశేఖర్ ఎక్కడా తగ్గడం లేదు. ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరో రాజశేఖర్ కూతురిగా శివాత్మిక సినిమాల్లోకి హీరోయిన్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా దొరసాని తోనే నటి గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఎంత ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినా అది ఇంట్రడక్షన్ వరకే ఆ తర్వాత టాలెంట్, అదృష్టం మాత్రమే నటీ నటులను నిలబెడతాయి. శివాత్మిక దొరసాని సినిమా తర్వాత మూడు తమిళ సినిమాలు మూడు తెలుగు సినిమాలు చేసింది. అయితే ఏ సినిమాలోనూ ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ చేయలేదు. కానీ మంచి పాత్రలు సెలెక్ట్ చేసుకోవడం లో ఎప్పుడూ ముందుంటుంది.

రీసెంట్ గా రంగమార్తాండ సినిమా లో హీరోయిన్ గా నటించింది. పేరుకు అందులో హీరోయినే అయినా అది హీరో హీరోయిన్ బేస్డ్ మూవీ కాదు. ప్రస్తుతం రెండు తెలుగు సినిమాల్లో నటిస్తున్న శివాత్మిక రీసెంట్ గా ఒక ఫోటోషూట్ చేసింది. అందులో బ్లూ కలర్ చీర లో ఎక్స్ పోసింగ్ చేస్తూ ఫోజులిచ్చింది. ఇప్పటివరకు రాజశేఖర్ కూతురి గానే పేరు తెచ్చుకున్న శివాత్మిక తనకంటూ ఒక సొంత గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాట పడుతుంది.

అయితే ముందుగా నటనకి స్కోప్ ఉన్న పాత్రలనే సెలెక్ట్ చేసుకున్న శివాత్మిక ఇప్పుడు ఎలాంటి హీరోయిన్ గా నైనా సరే చేయడానికి సిద్ధం అంటుంది. ఎక్స్ పోసింగ్ విషయం లో స్టార్ హీరోయిన్లకు నేనేం తీసిపోనంటుంది. మరి స్టార్ హీరోలు, డైరెక్టర్ల సినిమాల్లో ఈ ఫోటో షూట్ ల ద్వారా నైనా మంచి ఆఫర్స్ వస్తాయేమో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు