Farhana: ఐశ్వర్య రాజేష్ కి తోడుగా రష్మిక

కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమయింది ఐశ్వర్య రాజేష్. ఈ జెనరేషన్ లో గ్లామర్ రోల్స్ చేసే హీరోయిన్ లు చాలా మంది ఉన్నారు, కానీ కథకి కావాల్సిన కీ రోల్ లేక మంచి ఇంపాక్ట్ ఫుల్ రోల్ ఉంది చేయండి అంటే మాత్రం హీరోయిన్ లలో దాదాపు ఎవరు ముందుకి రారు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి గ్లామర్ రోల్ చేసే అవకాశాలు ఉండవని భయం . కానీ ఐశ్వర్య రాజేష్ మాత్రం హీరోయిన్ రోల్స్ కన్నకూడా మంచి పాత్ర ఏదైనా ఉంటే ఆమె చేస్తూ ఈ తరం హీరోయిన్ లకి స్ఫూర్తి గా నిలుస్తుంది.

ఐశ్వర్య రాజేష్ తెలుగులో టక్ జగదీష్, వరల్డ్ ఫెమస్ లవర్ ,రిపబ్లిక్ సినిమాలలో నటించింది. చేసిన అన్ని సినిమాలలోనూ ఆమె గుర్తుండిపోయే పాత్రలలో నటించి అందరిని మెప్పించింది.ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో వస్తోన్న లేటెస్ట్ చిత్రం “ఫర్హానా ”

పెళ్లి అయిన కొద్దీ రోజులకే భర్త చనిపోయి కుటుంబ భారం మోస్తూ కూతురిని చదివించుకునే ముస్లిం తల్లి పాత్రలో ఆమె నటిస్తుంది. ఈ మధ్య కాలంలో జరుగుతున్న కాల్ సెంటర్ , చాటింగ్స్ ,డేటింగ్స్ యాప్ ల కథనాలు, నేరాలు ,ఉద్దేశ్యాలు ఇతివృత్తంగా ఈ సినిమా ఉండబోతున్నట్టు ఫర్హానా టీజర్ ద్వారా తెలుస్తోంది. ఈ సినిమాని తెలుగు , తమిళ్, హిందీ బాషలలో తెరకెక్కిస్తున్నారు. తెలుగులో ఖాకి, ఖైదీ , ఒకే ఒక జీవితం సినిమాలను అందించిన డ్రీం వారియర్ పిక్చర్స్ బ్యానర్ లో ఈ సినిమా రాబోతుంది.

- Advertisement -

తమిళ్ డైరెక్టర్ నెల్సన్ వెంకటేశన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.ఈ సినిమాకి జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందిస్తున్నారు. నిన్న సాయత్రం నేషనల్ క్రష్ రష్మిక ఈ సినిమా టీజర్ ని విడుదల చేసింది. కత్తి పై నడుస్తూ గమ్యాన్ని చేరుకుంటున్న ఐశ్వర్య రాజేష్ పోస్టర్ అందరిని ఆకట్టుకుంటుంది. మే 12 ఈ సినిమా థియేటర్స్ లో విడుదల అవబోతుంది.

 

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు