సినిమాల విషయంలో అప్పుడప్పుడు విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అది సినిమా కథ, పాత్రలు మొదలగు అంశాలు కామన్ గా ఉండటం, అలా ఒకే అంశం ప్రధానంగా రూపొందిన సినిమాలు ఒకే సమయంలో విడుదల అవ్వటం గతంలో పలుమార్లు చూశాం. అయితే ఒకే అంశం ప్రధానంగా ఉన్న సినిమాలు కొన్ని బ్లాక్ బస్టర్స్ అయితే, ఇంకొన్ని డిజాస్టర్స్ గా మిగిలాయి. అలా హిట్ అయిన సినిమాల్లో కామన్ గా ఉన్న అంశం కొన్నాళ్ల పాటు సినిమాల్లో ట్రెండ్ అవుతూ ఉంటుంది.
యాదృచ్చికమో, కాకతాళీయమో గానీ, ఇటీవల విడుదలైన తెలుగు సినిమాల్లో కాకి ప్రధాన పాత్ర పోషిస్తోంది. గతంలో కూడా వినయ విధేయ రామ, సైరా సినిమాల్లో గద్ద, పులి విలన్ల తలలు ఎత్తుకెళ్ళటం కామన్ గా ఉండటం సోషల్ మీడియాలో మీమ్స్ కి స్కోప్ ఇచ్చింది. ఇటీవల విడుదలైన బలగం, దసరా, విరూపాక్ష సినిమాల్లో కూడా కాకి ప్రధాన పాత్ర పోషించటంపై సోషల్ మీడియాలో నెటిజన్స్ తెగ మీమ్స్ షేర్ చేస్తున్నారు. బలగం సినిమాలో పిండ ప్రదానం సీన్లలో కాకి కీలకంగా ఉంటుంది. దసరా సినిమాలో కూడా నాని కీర్తి సురేష్ ల పెళ్లి సీన్లో కాకి కీలక పాత్ర పోషిస్తుంది.
సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ హీరో హీరోయిన్లుగా సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొంది ఇటీవల విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకున్న విరూపాక్ష సినిమాలో కూడా బిగినింగ్ నుండి ఎండ్ వరకు కాకి కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే కాకి కామన్ గా ఉన్న ఈ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవ్వడం. దీంతో కాకి తెలుగు సినిమాలకు బాగా కలిసొచ్చింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. అపశకునంగా భావించే కాకి, సినిమాల విషయంలో కలిసిరావడం చర్చకు తావిస్తోంది. అయితే ఇక మీదట కూడా కాకి ప్రధానాంశంగా సినిమాలు వస్తాయో చూడాలి.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News