Re-Release Trend: రీరిలీజ్ సినిమాలకు ఈ రేంజ్ లో డిమాండ్ చేయటం కరెక్టేనా..?

Re-Release Trend

టాలీవుడ్లో ప్రస్తుతం రీరిలీజ్ సినిమాల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. పలు రీరిలీజ్ సినిమాలు కొత్త సినిమాలను తలదన్నే రేంజ్ లో కలెక్షన్స్ సాధించాయి. ఈ క్రమంలో మెగాస్టార్ శంకర్ దాదా ఎంబిబిఎస్, ఏ మాయ చేసావే సినిమాల రైట్స్ కి నిర్మాతలు భారీ రేట్ డిమాండ్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. శంకర్ దాదా సినిమాకు 2కోట్లు డిమాండ్ చేస్తుండగా, ఏ మాయ చేసావే సినిమాకు కోటి రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారని సమాచారం. ఆ సినిమాలకు ఉన్న క్రేజ్ ప్రకారంగా ఈ రేట్స్ కోట్ చేయటం సమంజసమే అనిపించచ్చు కానీ, రీరిలీజ్ సినిమాల మీద ఇంత రేట్ పెట్టాలంటే డిస్ట్రిబ్యూటర్స్ కి రిస్క్ అనే చెప్పాలి.

చిరంజీవి మరో బ్లాక్ బస్టర్ సినిమా కూడా రీరిలీజ్ చేసే ప్లాన్ ఉందట వైజయంతి మూవీస్ సంస్థ. ఇంద్ర సినిమాతో పాటుగా ఈ ఏడాది డిసెంబర్ లోపల మరో 12క్లాసిక్ సినిమాలను రీరిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది. ఇంద్ర సినిమా డీల్ ఇంకా పెండింగ్ ల ఉండగా, ఈ సినిమాకు కూడా ఫ్యాన్సీ రేట్ డిసైడ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

స్ట్రైట్ సినిమాలే కాకుండా డబ్బింగ్ సినిమాలు కూడా రీరిలీజ్ అయ్యి హౌస్ ఫుల్ షోస్ తో నడుస్తున్నాయి. ఇటీవల రీరిలీజ్ అయిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా ఇందుకు బెస్ట్ ఎక్జామ్పుల్. ఇదే బాటలో మరో యూత్ ఫుల్ బ్లాక్ బస్టర్ 7జి బృందావన్ కాలనీ సినిమాను కూడా రీరిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఈ లెక్కన చూస్తే ఈ ట్రెండ్ ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు