NBK’s Bhagavanth Kesari: మూడు సినిమాలు – ఒకటే కాన్సెప్ట్..!

NBK’s Bhagavanth Kesari

తెలుగు సినిమాల్లో సెంటిమెంట్ ఫార్ములాతో వచ్చిన సినిమాలకు సక్సెస్ రేట్ ఎక్కువే. మదర్ సెంటిమెంట్, ఫాదర్ సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్, డాటర్ సెంటిమెంట్ ఇలా రిలేషన్ ఏదైనా కానీ  సెంటిమెంట్ సినిమాలకు ఫ్యామిలీ ఆడియెన్స్ బ్రహ్మరథం పడతారు. ప్రస్తుతం డాటర్ అనిల్సెం టిమెంట్ తో ఒకేసారి మూడు తెలుగు సినిమాలు రానున్నాయి. అవేంటంటే, అనిల్ రావిపూడి బాలకృష్ణ కాంబినేషన్లో రూపొందుతున్న భగవంత్ కేసరి,  శైలేష్ కొలను డ్రెక్షన్లో విక్టరీ వెంకటేష్ నటించిన సైన్ధవ్, నాని మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన హాయ్ నాన్న సినిమాలు డాటర్ సెంటిమెంట్ తో రూపొందగా మూడు సినిమాలు ఈ ఏడాదిలోనే రిలీజ్ కానున్నాయి.

బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా శ్రీలీల బాలకృష్ణ కి కూతురి క్యారెక్టర్లో నటించిన భగవంత్ కేసరి సినిమా అక్టోబర్ 19న రిలీజ్ కి సిద్ధంగా ఉండగా, వెంకటేష్ హీరోగా వస్తున్న సైన్ధవ్, నాని నటించిన హాయ్ నాన్న సినిమాలు డిసెంబర్ రిలీజ్ కానున్నాయి. అఖండ, వీరసింహారెడ్డి లాంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలకృష్ణ నుండి వస్తున్న సినిమా కావటంతో భగవంత్ కేసరిపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక సతమతం అవుతున్న వెంకటేష్ కి సైన్ధవ్ సినిమా హిట్ అవ్వటం కీలకంగా మారింది. శైలేష్ కొలను డైరెక్టర్ కావటంతో పాటు ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ హైలైట్ గా నిలుస్తాయని ప్రచారం ఉన్న నేపథ్యంలో సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత చిత్రం దసరాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నాని కూడా డాటర్ సెంటీఎన్టీ వస్తున్న హాయ్ నాన్న సినిమా ద్వారా మరొక బ్లాక్ బస్టర్ అందుకోవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి, ఒకే కాన్సెప్ట్ తో వస్తున్న ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు