Pawan Kalyan’s OG: ఓజి అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కాదా..?

Pawan Kalyan’s OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్లో మాఫియా బ్యాక్డ్రాప్ లో ఓజి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. 2024 సంక్రాంతికి రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్న ఈ సినిమాకి సంబంధించి గ్లిమ్ప్స్ మినహా ఏ అప్డేట్ లేకపోవటంతో సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. సినిమా అనౌన్స్ చేసిన నాటి నుండి పోస్టర్స్ మీద ‘ They Call Him OG ‘ అనే క్యాప్షన్ ఉండటంతో OG అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని ప్రచారం సాగింది. ఓజి అన్న టైటిల్ జనాల్లోకి వెళ్ళటం వల్ల సినిమా యూనిట్ కూడా అదే టైటిల్ ని ఫిక్స్ చేసింది.

ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ గురించి ఓకే ఆసక్తికర అంశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓజి అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కాదని, అది సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ పేరని టాక్ వినిపిస్తోంది. ఓజి అంటే ‘ ఓజాస్ గంభీరా’ అని అంటున్నారు. మొదట డిసెంబర్ లో రిలీజ్ అవుతుందని ప్రచారం జరిగిన ఈ సినిమాను ప్రస్తుతం 2024 సంక్రాంతికి రిలీజ్ చేస్తారని అంటున్నారు.

మాఫియా బ్యాక్డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ హైలైట్ గా నిలుస్తాయని వార్తలొస్తున్న నేపథ్యంలో అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఇటీవల బ్రో సినిమా ఆశించిన స్థాయిలో అలరించకపోవటం వల్ల పవర్ స్టార్ ఫ్యాన్స్ హోప్స్ అన్నీ ఈ సినిమా మీదనే పెట్టుకున్నారు. మరి, పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్న ఈ సినిమా పవర్ స్టార్ కి బ్లాక్ బస్టర్ ఇస్తుందా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు