Samantha’s Kushi: అక్కడికెళ్లినా సమంత ను వదలని నెటిజన్స్..!

Samantha’s Kushi

లేడీ సూపర్ స్టార్ సమంత సినిమాలకు గ్యాప్ ఇస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.  విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషి సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న సమంత ఆ ఈవెంట్ తర్వాత అమెరికా వెళ్ళింది. అనారోగ్యం కారణంగా విశ్రాంతి కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత ఇక ఏడాది పాటు కనిపించదు అని అనుకున్నారు అందరు. అయితే,సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే సమంత అమెరికా వెళ్లినప్పటి నుండి తన ఇన్స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా ఫోటోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ కే టచ్ లో ఉంటోంది. అమెరికా వీధుల్లో స్వేచ్ఛగా విహరిస్తూ ఇంతకు ముందెప్పుడూ చేయని పనులు స్వేచ్ఛగా చేస్తున్నానంటూ తన సంతోషాన్ని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వ్యక్తం చేసింది.

సమంత పోస్ట్స్ పట్ల ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తుండగా కొంతమంది నెటిజన్స్ మాత్రం నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. హెల్త్ కోసం రెస్ట్ తీసుకోవాలని వెళ్ళావా లేక వెకేషన్ కి వెళ్ళావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అమెరికా వీధుల్లో తిరుగుతూ ఫోటోలు పోస్ట్ చేసేటప్పుడు విశ్రాంతి కోసం వెళ్తున్నానని చెప్పటం ఎందుకు, వెకేషన్ కి వెళ్తున్నా అని చెప్పచ్చు కదా అంటూ సమంతని టార్గెట్ చేస్తున్నారు.

సమంత నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కానుండగా సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావటంతో సినిమా కోసం ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఖుషి ట్రైలర్ లో సమంత, విజయ్ ల మధ్య కెమిస్ట్రీ హైలైట్ అవ్వటంతో సినిమాకు కూడా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. మరి, శాకుంతలం లైగర్ లాంటి డిజాస్టర్స్ తర్వాత విజయ్, సమంతలకు ఖుషి సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ అందుతుందా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు