NBK’s Bhagavanth Kesari: బాలయ్యను పూర్తిగా మార్చేసిన అనిల్ రావిపూడి..!

NBK’s Bhagavanth Kesari

బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో భగవంత్ కేసరి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాను అక్టోబర్ 19న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసింది సినిమా యూనిట్. బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది. ఎంటర్టైనర్ సినిమాలకు కేరాఫ్ అయిన దర్శకుడు అనిల్ రావిపూడి, మాస్ కి బ్రాండ్ నేమ్ అయిన బాలకృష్ణల కాంబినేషన్ కావటంతో ఈ సినిమాపై అనౌన్స్ చేసిన నాటి నుండి ఆడియెన్స్ లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ తో పాటుగా ఎమోషనల్, ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ కూడా ఉండేలాగా ప్లాన్ చేశాడట డైరెక్టర్ అనిల్ రావిపూడి.

ఇంకో ఆసక్తికర అంశం ఏంటంటే, ఈ సినిమా సెట్స్ లో బాలకృష్ణ బిహేవియర్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోందని టాక్ వినిపిస్తోంది. సాధారణంగా బాలకృష్ణ సెట్స్ లో ఉన్నాడంటే యూనిట్ అంతా టెన్షన్ టెన్షన్ గా ఉండేదని కానీ, ఈ సినిమా సెట్స్ లో బాలకృష్ణ చాలా సరదా సరదాగా గడుపుతున్నాడని, బాలయ్యలో ఈ మార్పుకి కారణం అనిల్ రావిపూడి అని యూనిట్ అంటున్నారు.

భగవంత్ కేసరి సినిమాలో శ్రీలీల క్యారెక్టర్ కూడా కొత్తగా ఉంటుందని, డ్యాన్స్ తో పాటుగా యాక్షన్ సీక్వెన్స్ లో కూడా కనిపించనుందని సమాచారం అందుతోంది. మొత్తానికి, ఈ మధ్యకాలంలో వస్తున్న బాలకృష్ణ సినిమాల కంటే డిఫరెంట్ గా ఉందనున్న ఈ సినిమా బాలకృష్ణకి మరొక బ్లాక్ బస్టర్ ఇస్తుందా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు