Bhagavanth Kesari: శ్రీలీల ఇమేజ్ ని మార్చే పనిలో పడ్డ అనిల్ రావిపూడి…!

ప్రస్తుతం టాలీవుడ్లో బిజీయెస్ట్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది శ్రీలీల అని నిస్సందేహంగా చెప్పచ్చు. సీనియర్ హీరో, యంగ్ హీరో అన్న తేడా లేకుండా అరడజనుకి పైగా సినిమాలను వరుసగా లైన్లో పెట్టిన ఈ కన్నడ భామ టాలీవుడ్ కి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. అందం అభినయంతో పాటు డాన్స్ లో ఇరగదీస్తుండటం ఈ అమ్మడికి ప్లస్ పాయింట్ అయ్యింది. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో రూపొందుతున్న భగవంత్ కేసరి సినిమాలో నటిస్తోంది శ్రీలీల. ఈ సినిమాలో శ్రీలీల క్యారెక్టర్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలో శ్రీలీల క్యారెక్టర్ కి చాలా ప్రాధాన్యం ఉందని, శ్రీలీల పాత్రతో కొన్ని ట్విస్ట్ లు ఉంటాయని సమాచారం అందుతోంది.

శ్రీలీల క్యారెక్టర్ ని దర్శకుడు అనిల్ రావిపూడి ఏంటో ఆసక్తికరంగా డిజైన్ చేసాడని అంటున్నారు. ఇదే గనక నిజమైతే, ఇప్పటిదాకా కమర్షియల్ సినిమా హీరోయిన్ పాత్రలకే పరిమితమైన శ్రీలీల ఈ సినిమాతో కొత్త ఇమేజ్ సొంతం చేసుకునే అవకాశం ఉంది. అంతే కాకుండా భగవంత్ కేసరి సినిమాలో బాలకృష్ణ, కాజల్ పాత్రలు కూడా విభిన్నంగా ఉండనున్నాయని టాక్ వినిపిస్తోంది.

అక్టోబర్ లో రిలీజ్ కి ప్లాన్ చేసిన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యి సినిమాపై ఆసక్తి పెంచింది. అనిల్ రావిపూడి, బాలకృష్ణ కాంబినేషన్ కావటంతో ఈ సినిమాపై నార్మల్ ఆడియెన్స్ లో కూడా ఆసక్తి నెలకొంది. మరి ఇప్పటిదాకా ఎంటర్టైనింగ్ సినిమాలే తీసిన అనిల్ రావిపూడి బాలయ్యని ఎలా డీల్ చేసాడు అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు