Akhil: అఖిల్ సినిమాకి భారీ బడ్జెట్ – రిస్క్ అవసరమా..!

అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఏజెంట్ సినిమా డిజాస్టర్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సుమారు రెండేళ్ల పాటు సిక్స్ ప్యాక్ మెయింటైన్ చేసి అఖిల్ పడ్డ కష్టం అంతా వృధా అయ్యింది ఏజెంట్ సినిమా ద్వారా. ఇదిలా ఉండగా, అంతటి డిజాస్టర్ తర్వాత కూడా ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా తన నెక్స్ట్ సినిమాని లైన్లో పెట్టే పనిలో పడ్డాడు అఖిల్. అఖిల్ నెక్స్ట్ సినిమా యువీ క్రియేషన్స్ బ్యానర్ లో ఉండనుందని గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. సోషియో ఫాంటసీ గా రూపొందనున్న ఈ సినిమా రూపొందనున్న ఈ సినిమా టైటిల్ ధీర అని కూడా ప్రచారం జరుగుతోంది.

తాజాగా అందుతున్న సమాచారం ఏంటంటే, యువీ క్రియేషన్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ లో ప్లాన్ చేస్తుందట. అసలే ఏజెంట్ లాంటి డిజాస్టర్ పడ్డ అఖిల్ ఆపై అనుభవం లేని డైరెక్టర్ ని నమ్మి భారీ బడ్జెట్ సినిమా అంటే పెద్ద రిస్క్ అని అభిప్రాయపడుతున్నారు ట్రేడ్ పండితులు. ఏజెంట్ ద్వారా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్న అనిల్ సుంకరని చూసి కూడా యువీ వారు ఇంత రిస్క్ ఎందుకు చేస్తున్నారు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

ఒకవేళ ఈ వార్త గనక నిజం అయితే, అఖిల్ స్టామినాకి ధీర సినిమా పెద్ద పరీక్షే అవుతుందని చెప్పాలి. ఏజెంట్ సినిమాకి కూడా అఖిల్ మార్కెట్ కి రెట్టించిన బడ్జెట్ పెట్టడమే అంతటి డిజాస్టర్ రావటానికి కారణం అని చెప్పవచ్చు. అయితే, అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ లేని ఈ రూమర్స్ నిజమో కాదో తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు