Nidhi Agarwal: గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన నిధి అగర్వాల్..!

Nidhi Agarwal

ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ అందుకున్నప్పటికీ, ఆ సినిమా తర్వాత చెప్పుకోదగ్గ ఆఫర్లు సొంతం చేసుకోలేకపోయింది హీరోయిన్ నిధి అగర్వాల్. ఎడారిలో ఒయాసిస్ లాగా హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చినప్పటికీ ఆ సినిమా డిలే అవుతూ వస్తుండటం, అసలు పూర్తవుతుందో లేక అటకెక్కుతుందో అన్న పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో నిధి కెరీర్ అయోమయంలో పడ్డట్టయింది. కోలీవుడ్లో అడపాదడపా ఆఫర్లు వస్తున్నప్పటికీ శింబుతో అఫైర్ అంటూ వచ్చిన రూమర్స్ అమ్మడి కెరీర్ పై ఇంపాక్ట్ చూపించాయి. ఇలాంటి సమయంలో నిధికి బంపర్ ఆఫర్ లాంటి ఛాన్స్ వచ్చిందని టాక్ వినిపిస్తోంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ పేరు కన్సిడరేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. పీరియాడిక్ హారర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ లో ప్రభాస్ త్వరలోనే జాయిన్ అవనున్నాడని సమాచారం అందుతోంది.

రాజా డీలక్స్ అన్న టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో హారర్ కామెడీతో పాటు రొమాన్స్, ఎమోషన్ కూడా ఉండేలాగా మారుతి ప్లాన్ చేస్తున్నాడని సమాచారం అందుతోంది. ప్రస్తుతం యాక్షన్ మూవీస్ తో నిండిన ప్రభాస్ లైనప్ లో ఈ సినిమా కాస్త రిఫ్రెషింగ్ ఉండనున్న నేపథ్యంలో అభిమానుల్లో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి, ఈ సినిమా ద్వారా అయినా నిధి అగర్వాల్ కి హిట్ దక్కి మంచి ఆఫర్లు వస్తాయా లేదా వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు