Hanuman Release Date: ఫిక్స్ అయ్యారు… కానీ, మీపై నమ్మకం లేదు దొర

Hanuman Release Date

ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా 11లాంగ్వేజెస్ లో ప్రతిష్టాత్మకంగా హనుమాన్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ పాటికే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా వీఎఫెక్స్ వర్క్ డిలే అవ్వటం వల్ల వాయిదా పడింది. 2024 జనవరి 12న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసింది సినిమా యూనిట్. అయితే, సంక్రాంతికి మహేష్ బాబు గుంటూరు కారం సినిమా, కమల్ హాసన్ శంకర్ ల ఇండియన్2 సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ కానున్నట్లు ఇప్పటికే డేట్స్ అనౌన్స్ చేసిన నేపథ్యంలో హనుమాన్ రిలీజ్ అనుకున్న సమయానికి వస్తుందా లేదా అన్న అనుమానం నెలకొంది. విజువల్ వండర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో వీఎఫెక్స్ కీ రోల్ ప్లే చేస్తుందని, ఈ విషయంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చాలా జాగ్రత్త వహిస్తుండటం వల్లనే ఈ సినిమా డిలే అవ్వటానికి కారణం అని అంటున్నారు.

అయితే, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హనుమాన్ సినిమా ముందుగా అనౌన్స్ చేసినట్లుగానే 2024 సంక్రాంతికి ఎట్టి పరిస్థితిలో రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. ఎన్నో అంచనాలతో వచ్చిన ప్రభాస్ ఆదిపురుష్ సినిమా వీఎఫెక్స్, కథా కథనాల విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొని డిజాస్టర్ అయిన నేపథ్యంలో ప్రశాంత్ వర్మ హనుమాన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, హనుమాన్ చాలీసా సాంగ్ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. 11లాంగ్వేజెస్ లో విజువల్ వండర్ గా రూపొందుతున్న ఈ సినిమా టాలీవుడ్ స్థాయిని పెంచే విధంగా ఉంటుందని సినిమా యూనిట్ గట్టి నమ్మకం వ్యక్తం చేస్తోంది. మరి, హనుమాన్ అనుకున్న సమయానికి విడుదలై అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు