Tiger Nageswara Rao Hero: టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ హీరో రవితేజ కాదు… మరి ఎవరంటే?

Tiger Nageswara Rao Hero

మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. స్టూవర్ట్ పురం దొంగ నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఇటీవల వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచింది. అదే సమయంలో రిలీజ్ కాబోతున్న బాలయ్య భగవంత్ కేసరి మూవీకి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాలో హీరోగా ఫస్ట్ రవితేజను అనుకోలేదట.

టైగర్ నాగేశ్వరరావు స్టోరీతో డైరెక్టర్ వంశీకృష్ణ నాయుడు నేరుగా నిర్మాత అభిషేక్ అగర్వాల్ దగ్గరికి వెళ్లాడట. అభిషేక్ అగర్వాల్ ఈ స్టోరీని విని హీరోగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను హీరోగా తీసుకుని హై బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఓ భారీ సినిమా చేయాలని అనుకున్నారట. స్టోరీని కూడా ప్రభాస్‌కి వినిపించరని టాక్. అయితే స్టోరీ నచ్చకపోవడంతో ప్రభాస్ టైగర్ నాగేశ్వరరావును రిజెక్ట్ చేశాడట.

అదే సమయంలో ప్రభాస్ (Prabhas) చేతిలో సలార్ కి చెందిన రెండు పార్ట్స్, ప్రాజెక్ట్ కె కి చెందిన రెండు పార్ట్స్‌తో పాటు మారుతితో చేస్తున్న కామెడీ హర్రర్, అర్జున్ రెడ్డి డైరెక్టర్‌తో చేస్తున్న స్పిరిట్ సినిమాలు కూడా ఉండటంతో డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఈ టైగర్ నాగేశ్వరరావు స్టోరీని రిజెక్ట్ చేశాడట.

- Advertisement -

దీంతో డైరెక్టర్ వంశీకృష్ణ నాయుడు, నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఫైనల్ గా రవితేజ దగ్గరకు వచ్చారట. రవితేజకు నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ మూవీ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. అక్టోబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Hollywood, Bollywood, Tollywood, Mollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు