Megastar’s Next: మెగాస్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై సస్పెన్స్..!

Megastar’s Next

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబినేషన్లో వచ్చిన భోళాశంకర్ డిజాస్టర్ అవ్వటం మెగాఫ్యాన్స్ పై తీవ్ర ప్రభావం చూపింది. ఇక రీమేక్ సినిమాలు చేయద్దంటూ మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. ఈ డిజాస్టర్ ఎఫెక్ట్ చిరంజీవి ఆలోచనా తీరు మీద కూడా ఇంపాక్ట్ పడిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చిరంజీవి కళ్యాణ్ కృష్ణ తో చేయబోయే సినిమా గురించి కూడా ఆలోచనలో పడ్డాడని సమాచారం అందుతోంది. బ్రో దాడి అనే మలయాళ సినిమాకి ఇది రీమేక్ అని మొదటి నుండి వార్తలొస్తున్న తరుణంలో భోళాశంకర్ లాంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ తర్వాత చిరు మరో రీమేక్ చేసే సాహసం చేస్తాడా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ ప్రాజెక్ట్ పై చిరంజీవి బర్త్ డే సందర్బంగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం మోకాలి సర్జరీ కోసం ఢిల్లీ వెళ్లిన మెగాస్టార్ సర్జరీ తర్వాత 3నెలలు రెస్ట్ తీసుకున్న తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణతో ఓ సినిమా, డైరెక్టర్ వశిష్ఠతో ఓ సోషియో ఫాంటసీ సినిమా కమిట్ అయ్యాడని వార్తలొస్తున్న నేపథ్యంలో ఈ రెండిటిలో ఏ ప్రాజెక్ట్ ని ముందుగా అనౌన్స్ చేస్తాడన్న సస్పెన్స్ మెగా ఫ్యాన్స్ లో నెలకొంది.

భోళాశంకర్ డిజాస్టర్ ఎఫెక్ట్ చిరంజీవి బర్త్ డే సెలెబ్రేషన్స్ పై కూడా పడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా మెగాస్టార్ బర్త్ డేకి నెలరోజుల ముందు నుండే సోషల్ మీడియాలో హడావిడి మొదలయ్యేది. అలాంటిది ఈ ఏడాది నామమాత్రపు సందడి కూడా కనిపించట్లేదు. భోళాశంకర్ సినిమా డిజాస్టర్ అవ్వటమే ఇందుకు ప్రధాన కారణం అని తెలుస్తోంది. మొత్తానికి భోళా కొట్టిన దెబ్బకి ఢీలా పడ్డ అభిమానులకు మెగాస్టార్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ఉన్న సస్పెన్స్ కి తెర దించి కాస్తయినా రిలీఫ్ ఇస్తాడా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు