Anchor Anasuya: వెక్కి వెక్కి ఏడ్చిన అనసూయ – ఏమైందంటే..?

Anchor Anasuya

స్మాల్ స్క్రీన్ మీద గ్లామర్ షో మాత్రమే కాకుండా తరచూ సోషల్ మీడియాలో ఎదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది యాంకర్ అనసూయ భరద్వాజ్. అర్జున్ రెడ్డి సినిమా సమయంలో హీరో విజయ్ దేవరకొండతో మొదలైన కాంట్రవర్సీ ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. వవ మధ్య ఖుషి సినిమా గ్లిమ్ప్స్ రిలీజ్ అయిన టైమ్ లో మళ్ళీ మొదలైంది ఈ రచ్చ. ఆ మధ్య సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ప్రెస్ మీట్లో ఈ కాంట్రవర్సీ కి ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకుంటున్నట్లు స్టేట్మెంట్ ఇచ్చింది అనసూయ. ఇక ఈ కాంట్రవర్సీ ముగిసింది అనుకుంటున్న సమయంలో అనసూయ వెక్కి వెక్కి ఏడుస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. అనసూయ ఆ వీడియో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఈ మధ్య సోషల్ మీడియాలో తనకు తీవ్ర నెగిటివిటీ ఎదురవుతుందంటూ ఓ నోట్ కూడా పోస్ట్ చేసింది అనసూయ. అసలు విషయానికి వస్తే, 5 రోజుల కిందట తాను లో ఫీల్ అయ్యి ఏడుస్తున్న సమయంలో ఈ వీడియో రికార్డ్ చేసినట్లు చెప్పుకొచ్చింది అనసూయ. తన లైఫ్ లో ఫోటోషూట్లు, చిరునవ్వులు, ఛాలెంజెస్ తో పాటు కష్టాలు కన్నీళ్లు కూడా ఉంటాయని, ఎంత గొప్పవారైనా కూడా జీవితంలో బాధలు తప్పవని చెప్పుకొచ్చింది.

లైఫ్ లో ఏదైనా కష్టం వచ్చినప్పుడు రెండు రోజులు కంటిన్యూగా ఏడ్చి, ఆ కష్టం నుండి బయటికి వచ్చి మళ్ళీ మాములు వ్యక్తిలా అవుతానని ఆ నోట్ లో రాసుకొచ్చింది అనసూయ. తన లైఫ్ లో కూడా అందరిలాగే కష్టాలు, కన్నీళ్లు ఉంటాయని తెలియజేయడానికి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా అని, ఇప్పుడు హ్యాపీగా ఉన్నానని తెలిపింది. అయితే, తన లైఫ్ గురించి చెప్పటానికి ఇలా బోరున ఏడుస్తూ వీడియో పెట్టడం చాలా విచిత్రంగా ఉందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి ఎమోషన్స్ ని కూడా అటెన్షన్ కోసం వాడుకోవటం టూ మచ్ అని కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు