Anasuya: అటెన్షన్ కోసమేనా అనసూయ ఈ తిప్పలు..?

అనసూయ భరద్వాజ్, యాంకర్ గా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి, అప్పటిదాకా టీవీ యాంకరింగ్ లో ఉన్న ట్రెండ్ ని బ్రేక్ చేసి గ్లామర్ షోతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. టీవీ యాంకర్ అయినప్పటికీ హీరోయిన్లతో సమానమైన క్రేజ్ సొంతం చేసుకున్న అనసూయ రంగస్థలం లాంటి సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ లో కూడా నటించి మెప్పించింది. క్రేజ్ విషయాన్ని పక్కన పెడితే, వివాదాలతో కూడా మంచి సహవాసం చేస్తుంటోంది ఈ స్టార్ యాంకర్. గతంలో అర్జున్ రెడ్డి సినిమా విషయంలో హీరో విజయ్ దేవరకొండ, అతని అభిమానులతో నెలకొన్న వివాదం ఇప్పటికి కూడా సద్దుమణగలేదని ఇటీవల ఖుషి సినిమా విషయంలో జరిగిన రచ్చ చూస్తే తెలుస్తుంది. అంతే కాకుండా కొంతమంది ట్రోలర్స్ తనని ఆంటీ అంటూ తరచూ కామెంట్ చేస్తుండటం పట్ల కూడా ఘాటుగానే రియాక్ట్ అవుతూ ఉంటుంది.
అనసూయ ఇలా సోషల్ మీడియాలో తరచూ ఎదో ఒక అంశం మీద రచ్చ చేయటం అటెన్షన్ కోసమే అని నెటిజన్లు అభిప్రాయపడుతుంటారు. ఇదిలా ఉండగా, తాజాగా తన వెడ్డింగ్ అనివర్సరీ సందర్బంగా భర్తతో కలిసి వెకేషన్ కి వెళ్లిన అనసూయ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. బీచ్ లో బికినీలో పోజ్ ఇస్తూ అనసూయ పోస్ట్ చేసిన ఫోటోలపై మిశ్రమ స్పందన వస్తోంది సోషల్ మీడియాలో. టీనేజ్ కి చేరిన పిల్లలున్న ఈ వయసులో అటెన్షన్ కోసం ఇన్ని తిప్పలు అవసరమా అని కామెంట్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. జబర్దస్త్ కి దూరమైన అనసూయకి అటు బుల్లితెరపై, ఇటు సోషల్ మీడియాలో ఫోకస్ తగ్గిందని, ఇప్పుడు ఈ పోస్ట్స్ ద్వారా వైరల్ అయ్యి జబర్దస్త్ కి రీఎంట్రీ ఇచ్చే ప్లాన్ లో ఉందని కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు.
ఏది ఏమైనా, ఫెమినిజం, మేల్ డామినేషన్ అంటూ ట్విట్టర్లో ప్రవచనాలు వల్లించే హాట్ యాంకర్ తన పర్సనల్ స్పేస్ లో వాటిని విస్మరించి ఇలా విచ్చలవిడిగా వ్యవహరించటం విమర్శలకు తావిస్తోంది. ఈ క్రమంలో తన బికినీ పోస్ట్ పై వెల్లువెత్తుతున్న విమర్శలకు అనసూయ ఎలా స్పానదిస్తుంది, అసలు స్పందిస్తుందా లేదా అన్న ఆసక్తి నెలకొంది.
For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు