Guntur Kaaram: ఆ స్టార్ హీరోయిన్ తో మహేష్ లవ్ స్టోరీ – ఫుల్ స్టాప్ పెట్టిన నమ్రత..!

సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత ల ప్రేమ వివాహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే, నమ్రతతో పెళ్ళైన తర్వాత మహేష్ బాబు మరో స్టార్ హీరోయిన్ తో ప్రేమాయణం నడిపాడన్న రూమర్స్ అప్పట్లో తెగ హల్చల్ చేశాయి. ఓ సినిమాలో కలిసి నటించిన హీరోయిన్ తో మహేష్ చాలా క్లోజ్ గా మూవ్ అయ్యేవాడని, ఇద్దరి మధ్య స్ట్రాంగ్ రిలేషన్ కూడా డెవలప్ అయ్యిందన్న టాక్ వినిపించింది అప్పట్లో. నమ్రత ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మహేష్ ఆ హీరోయిన్ కి దూరమయ్యాడని అంటూ ఉంటారు. ఈ రూమర్స్ లో నిజం ఎంతుందో తెలీదు కానీ, మహేష్ విషయాల్లో నమ్రత డామినేషన్ మాత్రం నిజం అని ఫిలిం నగర్ సర్కిల్స్ లో ఎప్పటినుండో వినిపిస్తున్న టాక్.
అయితే, అప్పటికే మహేష్ బాబుతో ప్రేమలో ఉన్న నమ్రత విషయం తెలుసుకొని ఆ స్టార్ హీరోయిన్ కి వార్నింగ్ ఇచ్చి ఆ ఇద్దరి లవ్ స్టోరీకి బ్రేక్ వేసిందట. ఇక ఆలస్యం చేస్తే మహేష్ తనకి దక్కడని భవించిన నమ్రత, సీక్రెట్ గా నిరాడంబరంగా పెళ్లి చేసుకుందని అంటుంటారు. వంశీ సినిమాలో కలిసి నటించిన మహేష్, నమ్రతలు అప్పట్లోనే పెళ్లికి రెడీ అయ్యారని కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవటం వల్ల చాలా కాలం వేచి చూడాల్సి వచ్చిందని కూడా టాక్ వినిపించింది. ఈ ఎపిసోడ్ జరిగినంత కాలం మహేష్ కి వరుస ఫ్లాప్స్ ఉండేవని, సదరు స్టార్ హీరోయిన్ తో ప్రేమలో పడ్డాక బ్లాక్ బస్టర్ అందుకోవటంతో మహేష్ ఆమెకి మరింత దగ్గరయ్యాడని, అది చూసి సహించలేని నమ్రత ఆ హీరోయిన్ కి గట్టి వార్నింగ్ ఇచ్చిందని అప్పటి నుండి మహేష్ సినిమాల్లో ఆ హీరోయిన్ కి ఛాన్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడుతూ వస్తోందని కూడా టాక్ ఉంది.
అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన మహేష్ లవ్ స్టోరీ నమ్రత ఇన్వాల్వ్ మెంట్ వల్ల వెలుగులోకి రాకుండా పోయిందని తెలుస్తోంది. మొత్తానికి మహేష్ సినిమా వ్యవహారాల్లోనే కాకుండా తన పర్సనల్ లైఫ్ లో నమ్రత డామినేషన్ కనిపిస్తోందని ఈ ఎపిసోడ్ వల్ల స్పష్టం అవుతోంది. గతంలో బ్రహ్మోత్సవం సినిమా విషయంలో నమ్రత ఇన్వాల్వ్ అవ్వటం వల్లే సీన్ రివర్స్ అయ్యిందన్న ప్రచారం కూడా జరిగింది.
For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు