Tillu Square: ఛాన్సులు లేకుంటే ఇంత దిగజారాలా..?

అనుపమ పరమేశ్వరన్, ప్రేమమ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యి, అందరి దృష్టిని ఆకర్షించి వరుస ఆఫర్లు అందుకుంది ఈ కేరళ కుట్టి. వరుస ఆఫర్లు వచ్చినప్పటికీ టాప్ హీరోల సరసన అవకాశాలు అందుకోలేకపోయింది. నటించిన ప్రతి సినిమాలో అనుపమ నటనకు మంచి ప్రశంశలు వచ్చినప్పటికీ, కెరీర్ కి బూస్ట్ ఇవ్వలేకపోయాయి. ఇటీవల నిఖిల్ సరసన నటించిన కార్తికేయ2 సినిమా పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయినప్పటికీ అనుపమకు మాత్రం ఏ రకంగా ప్లస్ అవ్వలేకపోయింది. కెరీర్ తొలినాళ్లలో నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే యాక్సెప్ట్ చేస్తూ రొమాన్స్ కి దూరంగా ఉన్న అనుపమ క్రమక్రమంగా ఆఫర్లు సన్నగిల్లడంతో గ్లామర్ పాత్రలకు సైతం పచ్చ జెండా ఊపేస్తోంది. ఆ మధ్య రౌడీ బాయ్స్ సినిమాలో హీరో ఆశిష్ రెడ్డి తో లిప్ లాక్ సీన్స్ లో నటించి అందరికీ షాక్ ఇచ్చింది. ఆ సినిమాకు రెమ్యునరేషన్ కూడా గట్టిగానే తీసుకుందన్న టాక్ వచ్చింది అప్పట్లో.

ఇక తాజాగా, సిద్ధూ జొన్నలగడ్డ సరసన అనుపమ హీరోయిన్ గా నటిస్తున్న టిల్లు స్క్వేర్ సినిమాకు సంబంధించిన పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పోస్టర్లో సిద్దు, అనుపమ కార్లో డీప్ రొమాన్స్ లో ఉన్నట్టు ఇచ్చిన పోజ్ హీట్ పెంచేస్తోంది. అయితే, అప్పట్లో గ్లామర్ షోకి దూరంగా ఉంటూ కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంచుకున్న అనుపమ ఇప్పుడు చిన్న హీరోలతో కూడా రొమాంటిక్ సీన్స్ కి ఓకే చెప్పటానికి కారణం అవకాశాలు లేకపోవడమే అన్న అభిప్రాయం వెల్లడవుతోంది. సాధారణంగా ఏ హీరోయిన్ అయినా కెరీర్ ఫేడ్ అవుట్ అయ్యే దశలో బోల్డ్ క్యారెక్టర్స్ చేయటం మామూలే కానీ, అనుపమ లాంటి ఫ్యాన్ బేస్ ఉన్న హీరోయిన్ తనకున్న ఇమేజ్ ని పక్కన పెట్టి ఇలాంటి రోల్స్ చేయటం మాత్రం అరుదని చెప్పాలి.

ప్రస్తుతం అనుపమ లైనప్ లో టిల్లు స్క్వేర్, ఈగల్ సినిమాలు మినహా తెలుగులో పెద్ద సినిమాలేవీ లేవు. సంయుక్త మీనన్ లాంటి మలయాళీ ముద్దుగుమ్మలు తెలుగులో క్రేజీ ఆఫర్స్ తో దూసుకుపోతుంటే, తెలుగునాట మంచి ఫాలోయింగ్ ఉన్న అనుపమకి అవకాశాలు లేకపోవటం పట్ల అభిమానులు నిరాశకు గురవుతున్నారు. స్టోరీ సెలెక్షన్లో సరైన జడ్జిమెంట్ లేకపోవటం వల్లే అనుపమకు ఈ పరిస్థితి వచ్చిందన్న అభిప్రాయం వెలువడుతోంది. మరో పక్క, ఇప్పటివరకు టైర్2, టైర్3 హీరోల సరసన మాత్రమే నటించటం కూడా అనుపమకు నెగిటివ్ పాయింట్ అని చెప్పవచ్చు. మరి, ప్రస్తుతం నటిస్తున్న టిల్లు స్క్వేర్, ఈగల్ సినిమాల ద్వారా అయినా అనుపమ కమ్ బ్యాక్ ఇస్తుందో లేదో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు