Tollywood: ఈ సినిమాలు రిలీజ్ కి ముందే ప్లాప్ అని తెలుసా?

టాలీవుడ్ లో ఈ సంవత్సరం వారానికి నాలుగు సినిమాలు విడుదలవుతున్నా అందులో ఒక్కటే హిట్ అవుతుంది. అందులో ఒక్కోసారి అదికూడా జరగదు. కొన్ని సినిమాలు ఎన్నో అంచనాలతో వచ్బి ప్లాప్ అవగా, మరి కొన్ని సినిమాలు విడుదలకు ముందే హీరో వల్లో, ట్రైలర్ టాక్ వల్లనో ముందే బ్యాడ్ టాక్ తెచ్చుకుని ప్లాప్ అయ్యాయి. అయినా సరే ప్రొడ్యూసర్లు ఓన్ రిలీజ్ చేసుకుని మరీ డిజాస్టర్లు అందుకున్నారు. అలాంటి సినిమాలు మచ్చుకు చాలానే ఉన్నాయి.

2023 లో భారీ అంచనాలతో విడుదలైన శాకుంతలం, ఏజెంట్ సినిమాలు డిజాస్టర్లయ్యాయి. విడుదలకు ముందు బాగానే హైప్ ఉన్నా విడుదలైన తర్వాత బ్యాడ్ టాక్ తో బడ్జెట్ లో సగం కూడా రికవరీ చేయలేకపోయాయి.

ఇక సినిమా విడుదల కాకముందే ట్రైలర్ తోనే బ్యాడ్ టాక్ తెచ్చుకుని ఈ సినిమాలు ప్లాపయ్యాయి. అలాంటి కోవలోకే రామబాణం, మీటర్ నేను స్టూడెంట్ సర్ చెందుతాయి. ఈ సినిమాల్లో హీరో, ఇతర తారాగణం బాగానే ఉన్నా డైరెక్షన్ రొటీన్ గా ఉండడం వల్ల టేకింగ్ ఏమి బాగా లేక డిజాస్టర్లయ్యాయి.

- Advertisement -

ఇక సినిమా ఫస్ట్ లుక్ ల దగ్గర నుండి పాటలు, ట్రైలర్ ల విడుదలతో ముందునుంచి నెగిటివిటి సొంతం చేసుకుని డిజాస్టర్లు అయిన సినిమాలు కూడా ఉన్నాయి. అవే సి.ఎస్.ఐ సనాతన్, అహింస, మళ్ళీ పెళ్లి చిత్రాలు. ఈ సినిమాలు స్టార్ట్ అయినప్పటినుంచే జనాలు సినిమా దొబ్బింది అని ఫిక్స్ అయిపోయారు. ప్రేక్షకుల నుండి విడుదలకు ముందే ఇంత బ్యాడ్ టాక్ తెచ్చుకున్నా ఏమి చేయలేక చేతులెత్తేశారు దర్శకులు. ఇక అహింస సినిమా తీసిన డైరెక్టర్ తేజ అయితే ఈ సినిమా హీరో కోసం తీయలేదు. రామా నాయుడుకి ఇచ్చిన మాట కోసం తీశానని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి అందరికి షాక్ ఇచ్చాడు. అయినా ఇలాంటి సినిమాలు ప్లాప్ అవుతాయని డైరెక్టర్లకు తెలిసి మరీ ఎందుకు తీస్తారో తెలీదు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు