Mehar Ramesh: భోళా దొబ్బిందా…? తప్పెవరిది.. బాధ్యులెవరు?

మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు ఇండస్ట్రీని మూడు దశాబ్దాల పాటు ఏలిన హీరో. ఇండియాలో పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి, అదే రేంజ్ ఫ్యాన్ బేస్ మెయింటైన్ చేస్తున్న ఏకైక నటుడాయన. ఇప్పటికి యంగ్ హీరోలతో పోటీపడుతూ ఎవరికీ సాధ్యంకాని రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. ఈయన నుంచి ఈ మధ్యే వాల్తేరు వీరయ్య.. రొటీన్ కంటెంట్ ఉన్నా, బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి తన స్టామినా ఏంటో చూపించాడు. అలాంటిది మెగా స్టార్ తో మాస్ సినిమా తీస్తే ఎలా ఉండాలి. రికార్డులు బద్దలు కొట్టేలా మాస్ సబ్జెక్టు తో పాటు పది మంది సినిమా చూసి ఏదో ఒకటి ఇన్స్ పైర్ అయ్యేలా ఉండాలి.

కానీ నేటి తరం దర్శకులు వింటేజ్ చిరు అని, చిరు మాస్ అవతార్ అని పాత చిరంజీవిని చూపించడానికి ట్రై చేస్తున్నారు తప్పా, అసలు చిరంజీవి అంటే ఏంటో ఆడియన్స్ కి చూపించలేకపోతున్నారు. రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరు చేస్తున్న సినిమాలు బాగానే ఉన్నా, ఒక్క లుక్స్ విషయంలో డైరెక్టర్లు కరెక్ట్ గా ఆలోచించలేకపోతున్నారు. చిరుని యంగ్ గా చూపించే తాపత్రయం లో ఆయన లోని మాస్ లుక్ పై దృష్టిపెట్టలేకపోతున్నారు.

ఇప్పుడు చిరు చేస్తున్న సినిమాలో మళ్ళీ అదే రిపీట్ అవుతువుంది. చిరు హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరెకెక్కుతున్న “భోళా శంకర్” అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే చిరు అభిమానులు ఈ సినిమాపై ముందు నుంచే డిసపాయింట్మెంట్ తో ఉన్నారు. ఎందుకంటే అసలెవరు ఊహించని దర్శకుడు మెహర్ రమేష్ తో ఈ సినిమా తీస్తున్నాడు. ఎప్పుడో 14ఏళ్ళ కిందట వచ్చిన బిల్లా తో యావరేజ్ హిట్ కొట్టిన మెహర్ రమేష్ షాడో తర్వాత పదేళ్లు సినిమా తీయలేదు.

- Advertisement -

ఇక భోళా శంకర్ ను తమిళ హిట్ వేదాళం సినిమాకు రీమేక్ గా తీయడం మెగా ఫ్యాన్స్ కి అస్సలు మింగుడుపడలేదు. ఆ సినిమాయే పాత చింతకాయ పచ్చడిలా రొటీన్ గా ఉంటుంది. అది మళ్ళీ 8ఏళ్ళ తరువాత చిరు చేయడమేంటనీ ఫ్యాన్స్ అంటున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. భోళా మేనియా అన్న పేరుతో విడుదలైన ఈ సాంగ్ లో చిరంజీవి, ఇంకా లిరిక్స్ తప్ప ఏమీ బాగాలేవు. చిరు ఇంట్రో సాంగ్ అయిన ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ మహతి సాగర్ ఏమాత్రం న్యాయం చేయలేకపోయాడు. ఏదో మణిశర్మ కొడుకుకదా అని మంచి ఛాన్స్ ఇస్తే పాటకి ఒక్క ఫ్రెష్ ట్యూన్ కూడా ఇవ్వలేక విఫలమయ్యాడు.

ఇక ఈ పాటలో ఉన్న మరో నిరుత్సాహపరిచే విషయం కొరియోగ్రఫీ. శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించగా, సాంగ్ లో ఒక్క స్టెప్ కూడా చిరు ఈజ్ ని గుర్తుచేసేలా లేదు. ఇప్పటికే కొంతమంది స్టార్ హీరోలకు రొటీన్ కోరియోగ్రఫీ చేసి విమర్శలపాలైన శేఖర్, ఈసారి ఏకంగా చిరుతో సినిమా చేసిన అదే రొటీన్ స్టెప్స్ కంపోస్ చేసి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. సోషల్ మీడియాలో అయితే శేఖర్ ని తీసేసి లారెన్స్, ప్రభుదేవాలతో సాంగ్ రీ షూట్ చేయాలనీ కామెంట్స్ పెడుతున్నారు.

భోళా పాటలో చిరంజీవి లుక్స్ బాగానే ఉన్నా ఫ్యాన్స్ ఫీల్ అవుతున్న మరో అంశం కాస్ట్యూమ్స్. చిరుకి సంబంధించిన కాస్ట్యూమ్స్ రీ ఎంట్రీ నుంచి ఆయన కూతురు సుస్మితయే డిజైన్ చేస్తున్నారు. మొదటి రెండు సినిమాలకు పరవాలేదనిపించినా ఇప్పుడు కాస్ట్యూమ్స్ సెలెక్షన్స్ మాత్రం అస్సలు బాగాలేదు. చిరు ఏజ్ కి తగ్గట్టు డిజైన్ చేయకుండా యంగ్ హీరోలకు తగ్గట్టు డిజైన్ చేయడం వల్ల ఆ డ్రెస్సెస్ చిరంజీవికి సూట్ కావడం లేదు.

మరి ఒక్కపాట లో సినిమా మొత్తాన్ని డిసైడ్ చేయకపోయినా పాటను చూస్తే సినిమా దొబ్బింది అనే ఫీల్ రావడం ఖాయం. యూట్యూబ్ లో విడుదలైన ఈ పాటకు వచ్చిన లైక్స్ లెక్కను బట్టే ఈ చిత్ర యూనిట్ పై చిరు అభిమానులు ఎంత గుర్రుగా ఉన్నారో తెలుస్తుంది. ట్రేడ్ విశ్లేషకులైతే ఈ సినిమాను మళ్ళీ రీషూట్ చేయడం మంచిదని అభిప్రాయపడుతున్నారు. మరి ఇన్ని ప్రతికూల అంశాల మధ్య చిత్ర యూనిట్ రీషూట్ చేస్తారా అంటే చెప్పలేం. కానీ మ్యూజిక్ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఆలోచించాలి. విడుదలైన పాత గురించి పెద్దగా పట్టించొకపోయినా ఇకముందొచ్చే పాటల విషయంలో జాగ్రత్త వహించాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు