Super Star’s Guntur Kaaram: థమన్ మ్యూజిక్ మహేష్ కి నచ్చట్లేదా..?

Super Star’s Guntur Kaaram

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న గుంటూరు కారం సినిమా మహేష్ బాబు ఫ్యాన్స్ సహనానికి పరీక్షగా మారింది. చాలా కాలం కిందట మొదలైన ఈ సినిమా షూటింగ్ ఒక అడుగు ముందుకేస్తే నాలుగు అడుగులు వెనక్కి అన్న చందాన నత్తనడకన సాగుతోంది. మొదట స్క్రిప్ట్ విషయంలో మహేష్ చేంజెస్ సజెస్ట్ చేయడం, ఆ తర్వాత ఫ్యామిలీతో మహేష్ వెకేషన్ వెళ్లగా పలు మార్లు షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత హీరోయిన్ పూజా హెగ్డే ని తపించటం, స్టంట్ మాస్టర్, సినిమాటోగ్రాఫర్ లను మార్చడం వంటి పరిణామాలతో సినిమా ఉంటుందా అటకెక్కుతుందా అన్న అనుమానాలు నెలకొన్నాయి. అయితే మొత్తానికి ఇటీవలే షూటింగ్ స్టార్ట్ చేసింది సినిమా యూనిట్.

మహేష్ బాబు బర్త్ డే కి సాంగ్ ప్రోమో వస్తుందని అందరు అనుకున్నారు కానీ, థమన్ ఇచ్చిన ట్యూన్స్ కి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవటం వల్ల అనుకున్న సమయానికి రిలీజ్ కాలేదు. ఇప్పటికే థమన్ కంపోజ్ చేసిన సాంగ్ కి ప్రోమో కూడా రెడీ అయ్యిందని, ఆ ట్యూన్స్ ని మహేష్ ఓకే చేస్తే రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ ఎదురు చూస్తుందట. అయితే, థమన్ ఇచ్చిన ట్యూన్స్ మహేష్ బాబుకి నచ్చలేదని, ట్యూన్స్ విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు నెలకొన్న కారణంగానే ప్రోమో రిలీజ్ డిలే అవుతుందని టాక్ వినిపిస్తోంది.

కారణాలు తెలీదు గానీ, మొదటి నుండి ఈ సినిమా విషయంలో మహేష్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ విషయంలో చాలా చేంజెస్ చెప్పిన మహేష్ ఇప్పుడు మ్యూజిక్ విషయంలో కూడా ఏదీ తేల్చకుండా డిలే చేస్తున్నాడు. ఒక పక్క ఇతర స్టార్ హీరోలందరి సినిమాల అప్డేట్స్ ఒక్కొకటి రిలీజ్ అవుతూ ఉత్సాహాన్ని పెంచుతున్న నేపథ్యంలో మహేష్ ఫ్యాన్స్ కి మాత్రం టీజర్ తో సరిపెట్టుకొని తర్వాత అప్డేట్స్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. మరి, అన్నీ సవ్యంగా సాగితే వినాయక చవితికి సాంగ్ ప్రోమో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో ఇంతటితో అయినా సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎదురుచూపులకి ఫుల్ స్టాప్ పడుతుందా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు