Prashanth Varma: హనుమాన్ టీమ్ అనవసరంగా రిస్క్ చేస్తుందా..?

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా హనుమాన్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. చాలా కాలం కిందట మొదలైన ఈ సినిమా ఈ పాటికి రిలీజ్ అవ్వాల్సి ఉండగా వీఎఫెక్స్ పనుల్లో జాప్యం వల్ల డిలే అవుతూ వస్తోంది. నిజానికి ఆదిపురుష్ సినిమాకంటే ముందుగానే రిలీజ్ అవుతుందని భావించిన ఈ సినిమాను 2024 జనవరి 12న రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేసింది సినిమా యూనిట్. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది. సంక్రాతి సీజన్ కి మహేష్, త్రివిక్రమ్ ల గుంటూరు కారం, రవితేజ ఈగల్ వంటి సినిమాలు ఇప్పటికే డేట్స్ అనౌన్స్ చేశారు. వీటికి తోడు ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబోలో రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమా ప్రాజెక్ట్ కె, చిరంజీవి – కళ్యాణ్ కృష్ణ సినిమా, విజయ్, పరశురామ్ కాంబోలో వస్తున్న సినిమాలను కూడా 2024 సంక్రాతికి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

అసలే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా, ఆ పై చిన్న హీరో, అలాంటప్పుడు ఇంత టఫ్ కాంపిటీషన్లో రావటం అవసరమా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలకు పాజిటివ్ టాక్ రావటం ఎంత అవసరమో సఫిషియెంట్ థియేటర్లు దొరకటం కూడా అంతే అవసరం. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి సరిపడా థియేటర్లు దొరకకపోతే ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా కూడా గట్టెక్కడం కష్టమే అని చెప్పాలి. అయితే, హనుమాన్ సినిమాని సంక్రాంతికి షిఫ్ట్ చేయటానికి అసలు కారణం వేరే ఉందని తెలుస్తోంది. ఈ సినిమా వీఎఫెక్స్ కోసం అనుకున్న బడ్జెట్ కంటే రెట్టింపు ఖర్చు అయ్యిందని, అయినప్పటికీ ఆదిపురుష్ రిజల్ట్ ప్రభావంతో హనుమాన్ టీమ్ వీఎఫెక్స్ విషయంలో మరింత జాగ్రత్త పడుతుందని అంటున్నారు.

ఆదిపురుష్ ప్రభావం వల్ల మొత్తం వీఎఫెక్స్ ని రీఎడిట్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అందుకే హనుమాన్ సినిమా ఇంత ఆలస్యం అవుతుందని సమాచారం అందుతోంది. ఏది ఏమైనా ప్రశాంత్ వర్మ టీమ్ ఆదిపురుష్ రిజల్ట్ న్నీ దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త పడటం మంచిదే అయినప్పటికీ ఇంత హెవీ కాంపిటీషన్ ఉన్న సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేయటం కొంత రిస్క్ అనే అనిపిస్తుంది. మరి, కాంపిటీషన్ ని దృష్టిలో పెట్టుకొని సంక్రాంతి రేస్ నుండి తప్పుకుంటారా లేక కంటెంట్ ని నమ్ముకొని రిస్క్ చేస్తారా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు