Megastar: మెగా కాంబో మళ్ళీ రిపీట్ అవుతోంది..!

మెగాస్టార్ చిరంజీవి, దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన మ్యూజికల్ హిట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే మెగాస్టార్ రీఎంట్రీ తర్వాత ఖైదీ నంబర్ 150, వాల్తేరు వీరయ్య సినిమాలకు దేవి సంగీతం అందించినప్పటికీ అప్పటి మ్యాజిక్ రిక్రియెట్ అవ్వలేదు. ఈ మేరకు అభిమానుల్లో కూడా కొంత అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మళ్ళీ చిరు, డీఎస్పీ కాంబినేషన్లో సినిమా రానుందని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం భోళాశంకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న మెగాస్టార్ ఆ తర్వాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. చూరు సరసన త్రిష హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాకు డీఎస్పీ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించనున్నాడని వార్తలొస్తున్నాయి. ఈ నెల 22న ప్రారంభం కానున్న ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే రానుందని సమాచారం.

రావు రమేష్, శ్రీవిష్ణుల కోసం సిద్ధం చేసిన స్క్రిప్ట్ మెగాస్టార్ కి నచ్చటంతో అందులో తన ఇమేజ్ కి తగినట్టు మార్పులు చేయమని సూచించి ఈ ప్రాజెక్ట్ ఓకే చేశారని సమాచారం. రావు రమేష్ పాత్రలో చిరు, శ్రీవిష్ణు పాత్రలో సిద్దు జొన్నలగడ్డ నటించనున్నారట. సుమారు 17ఏళ్ళ తర్వాత చిరుతో కలిసి నటిస్తున్న త్రిష ఈ సినిమాలో సిద్దు తల్లి పాత్రలో కనిపించనుంది. మొత్తానికి చిరు తన కంఫర్ట్ జోన్ దాటి మిడిల్ ఏజ్ క్యారెక్టర్లో నటించటానికి సిద్ధపడటం, చాలా కాలం తర్వాత త్రిష తెలుగులో స్ట్రైట్ ఫిలిం చేయనుండటం, దేవిశ్రీప్రసాద్, చిరు కాంబినేషన్ రిపీట్ అవుతుండటం పట్ల ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

2024 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న ఈ సినిమాను ఆగస్టులో స్టార్ట్ చేసి వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని భావిస్తున్నాడట చిరు. తనతో సినిమా చేసేందుకు ఎదురు చూస్తున్న స్టార్ డైరెక్టర్స్ ని కాదని చిరంజీవి చెప్పుకోదగ్గ హిట్స్ లేని యంగ్ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇవ్వటం ఒకరకంగా ఆశ్చర్యమే అయినప్పటికీ రొటీన్ మాస్ మసాలా కథలతో కాకుండా ఈ సినిమాకి విభిన్నమైన కథతో వస్తుండటం అభిమానులకు ఊరటనిస్తుందని చెప్పాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు