Fans: తొలిప్రేమ రీ రిలీజ్ లో అభిమానుల అత్యుత్సాహం?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో తెలిసిందే. ఈ సినిమాతోనే పవన్ కళ్యాణ్ తొలి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. టాలీవుడ్ లో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీల్లో ఇదొకటి. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి పాతికేళ్ళు అయిన సందర్భంగా తొలిప్రేమను జూన్30న రీ రిలీజ్ చేయడం జరిగింది. ఇక లిమిటెడ్ థియేటర్లలో రిలీజ్ అయినప్పటికీ ఈ సినిమా అన్నిచోట్లా హౌస్ ఫుల్ అయ్యింది. తొలిప్రేమ రిలీజ్ అయినప్పుడు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ,రీ రిలీజ్ అయినప్పుడు కూడా అంతకుమించి రెస్పాన్స్ దక్కించుకుంది.

చాలా చోట్ల అప్పటి సీనియర్ అభిమానులు కూడా వచ్చి థియేటర్లలో హుంగామ చేసారు. అయితే ఈ థియేటర్లలోనే కొందరు అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వివరాల్లోకి వెళితే తొలిప్రేమ రీ రిలీజ్ సందర్భంగా వైజాగ్ లోని కాపర్ది థియేటర్ లో స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. అయితే ఈ సినిమా సెకండ్ షో ప్లే అవుతున్న సమయంలో కొంతమంది అభిమానులు అత్యుత్సాహం లో థియేటర్ లోని స్క్రీనింగ్ తెర చించేశారు. అంతే కాదు మరికొంతమంది థియేటర్లో సీట్లను విరగ్గొట్టి, అక్కడి సీసీటీవీ కెమెరాలను కూడా ధ్వంసం చేసారు. అడ్డం వచ్చిన థియేటర్ సిబ్బంది పై కూడా కొందరు చేయి చేసుకున్నారు.

అయితే ఈ విషయం పై స్పందించిన అక్కడి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళు పవన్ అభిమానులు కారని, సెకండ్ షో సినిమాకి అభిమానులతో కలిసి కొందరు ఆకతాయిలు ప్రవేశించారని తాగి వారు భీభత్సం చేసారు అని అన్నారు. పైగా తాము కూడా అడ్డుకోవడానికి ట్రై చేశామని అయినా వాళ్ళు మా మాట వినలేదని అన్నారు. జరిగినదాంట్లో తప్పెవరిది చెప్పలేము కానీ, ఒక్కోసారి అభిమానంతో కొన్ని తెలియకుండా పొరపాట్లు చేస్తారు. అలా జరగకుండా చూసుకుంటే అభిమానుల వల్ల హీరోలకు చెడ్డ పేరు రాకుండా ఉంటుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు