Mega Family: ఆధ్యాత్మిక బాట పట్టిన చైతన్య – నిహారిక దూకుడే కారణమా..?

మెగా డాటర్ నిహారిక కొణిదెల, ఆమె భర్త చైతన్య విడాకులు తీసుకోబోతున్నారని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను అటు మెగా ఫ్యామిలీ కానీ, ఇటు దంపతులు కానీ ఖండించక పోగా, చాలా కాలంగా నిహారిక చైతన్యలు కలిసి కనిపించకపోవడంతో ఆ రూమర్స్ కి బలం చేకూరుతోంది. ఇదిలా ఉండగా, ఈ మధ్య నిహారిక ప్రొడ్యూసర్ గా వెబ్ సిరీస్ లు సినిమాలు ప్రొడ్యూస్ చేయటం స్టార్ట్ చేసింది. అంతే కాకుండా ఈ మధ్య తరచూ ఫోటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో హైలైట్ అవుతూ ఉంది. ఇటీవల డెడ్ పిక్సెల్స్ సినిమాలో బోల్డ్ డైలాగ్స్ తో అందరికీ షాక్ ఇచ్చింది. నిహారిక థింకింగ్ లో ఇంత మార్పు రావటానికి విడాకులే కారణం అని కొంతమంది అంటున్నారు.

ఇదిలా ఉండగా, చైతన్య తన ఇంస్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఓ ప్రముఖ ధ్యాన మందిరానికి వెళ్లిన చైతన్య, తన లైఫ్ లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ని ఫీల్ అవుతున్నానంటూ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన పోస్ట్ కింద నిహారిక ప్రవర్తన వల్ల విసిగిపోయి ఇలా ధ్యాన మందిరం బాట పట్టాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో వాస్తవం ఉందొ లేదో తెలీదు కానీ, విడాకుల గురించి రూమర్స్ వస్తున్న నేపథ్యంలో ఈ జంట ప్రవర్తనలో వచ్చిన మార్పు చూస్తుంటే రూమర్స్ నిజమే అన్న సంకేతం వస్తుంది.

మొత్తానికి సినీరంగంలో మెయిన్ పిల్లర్ గా ఉన్న మెగా ఫ్యామిలీలో ఈ వరుస విడాకుల వ్యవహారాలు అటు అభిమానులకు, ఇటు కుటుంబ సభ్యులకు తలనొప్పిగా మారాయని చెప్పాలి. అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ లేని ఈ వ్యవహారం గురించి తరచూ ఏదో ఒక గాసిప్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండటంతో మెగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు