Pushpa2: ఈ సారి ఎక్కువయ్యిందంటున్న శకావత్ సార్…!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్లో పుష్ప సినిమాకి సీక్వెల్ గా పుష్ప2 సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి తరచూ ఎదో ఒక అప్డేట్ వినిపిస్తూ సినిమాపై హైప్ పెరుగుతోంది. ఆ మధ్య రిలీజ్ చేసిన గ్లిమ్ప్స్ వీడియో మినహా అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్ రిలీజ్ చేయలేదు సినిమా యూనిట్. సినిమా ఔట్ ఫుట్ విషయంలో సుకుమార్ చాలా జాగ్రత్త వహిస్తున్నాడని, సినిమా షూటింగ్ పూర్తయ్యేంత వరకు ఎలాంటి అప్డేట్ రిలీజ్ చేయకూడదని డిసైడ్ అయ్యాడని అంటున్నారు. డిసెంబర్ లో ఈ సినిమా రిలీజ్ ఉంటుందని వార్తలొస్తున్నప్పటికీ అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ లేకపోవటానికి ఇదే కారణం అని అంటున్నారు.

తాజాగా పుష్ప2 గురించి వినిపిస్తున్న మరో అప్డేట్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. అదేంటంటే, ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్, అల్లు అర్జున్ ఆమధ్య యాక్షన్ సీక్వెన్స్ లు హైలైట్ గా నిలుస్తాయని, ఇందులో ఇద్దరి మధ్య సీన్స్ కూడా ఎక్కువ ఉంటాయని ఫహద్ ఫాజిల్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. పార్ట్ 1లో క్లైమాక్స్ లో ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ హైలైట్ గా నిలువగా ఇప్పుడు ఫహద్ ఫాజిల్ ఇచ్చిన అప్డేట్ సినిమాపై మరింత ఆసక్తిగా తెరకెక్కుతోంది.

పుష్ప పార్ట్1 రిలీజ్ అయిన మొదటి వీకెండ్ వరకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఆ తర్వాత అనూహ్యంగా నార్త్ లో క్లిక్ అయ్యి పాన్ ఇండియా వైడ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో పార్ట్2 మీద అంచనాలు అమాంతం పెరిగిన నేపథ్యంలో సుకుమార్ పార్ట్2 లో గ్లోబల్ ఆర్టిస్ట్ లతో చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాడని సమాచారం అందుతోంది. మరి, భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు