Hanuman: ఆదిపురుష్ రిజల్ట్‌తో జాగ్రత్త పడుతున్న ప్రశాంత్ వర్మ..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్లో రూపొందిన ఆదిపురుష్ సినిమా ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా ఫస్ట్ షో నుండే మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి 340కోట్ల భారీ వసూళ్లు సాధించిన ఆదిపురుష్ కి సోమవారం నుండి అసలు పరీక్ష ఉండనుంది. రికార్డ్ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ సాధించి ఫస్ట్ వీకెండ్ గట్టెక్కిన ఈ సినిమా వీక్ డేస్ లో కూడా అదే జోరు కంటిన్యూ చేస్తుందా లేదా చూడాలి. ఇదిలా ఉండగా, ఈ సినిమా కథ విషయంలో సినిమాటిక్ లిబర్టీ తీసుకొని దర్శకుడు చేసిన మార్పులు చేర్పుల పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రావణుడి లుక్స్, హనుమంతుడి డైలాగ్స్ వంటి అంశాల పట్ల రామాయణాన్ని అవమానించారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, మన పురాణ ఇతిహాస నేపథ్యంలో వస్తున్న మరో సినిమా ‘హనుమాన్’ సినిమా యూనిట్ ఆదిపురుష్ రిజల్ట్ తో జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ పాటికి విడుదల కావాల్సిన ఈ సినిమా వీఎఫెక్స్ పనుల్లో జాప్యం వల్ల డిలే అవుతుందని సమాచారం. 1600కు పైగా వీఎఫెక్స్ షాట్స్ ఉండటం ఒక కారణం అయితే బడ్జెట్ అంచనాలు తప్పటం మరో కారణం అని టాక్ వినిపిస్తోంది. తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. ఆదిపురుష్ రిలీజ్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే హనుమాన్ విషయంలో ఎలాంటి విమర్శలు రాకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారని అనిపిస్తుంది.

హనుమంతుడి లుక్స్ విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని, మనం ముందు నుండి చూసిన హనుమంతుడి లాగే ఈ సినిమాలో కూడా చూపించబోతున్నామని స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. ఆ మధ్య రిలీజ్ అయిన టీజర్ సినిమాపై ఆసక్తి పెంచిన నేపథ్యంలో ట్రైలర్, తదితర అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. మరి, హనుమాన్ టాలీవుడ్ కి మరో పాన్ ఇండియా హిట్ ఇస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు