Prabhas: ఆదిపురుష్ ని మర్చిపోండి సలారోడు వస్తున్నాడు..

ఆదిపురుష్ సినిమా థియేటర్స్ లో సందడి చేస్తుండగానే, ప్రభాస్ నెక్స్ట్ సినిమా హడావిడి మొదలైంది. ప్రభాస్ హీరోగా కెజిఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తోన్న సలార్ సినిమా గురించి అందరికి తెల్సిందే. ఇప్పటికే షూటింగ్ పార్ట్ దాదాపు కంప్లిట్ చేసుకున్న ఈ సినిమా వచ్చే సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలవబోతుంది.

అయితే సలార్ సినిమా కూడా కెజిఎఫ్ తరహాలోనే రెండు భాగాలుగా రిలీజ్ అవబోతుంది. ఆదిపురుష్ సినిమాలో రాఘవ రాముడిగా సాఫ్ట్ గా కనిపించిన ప్రభాస్ ఈ సినిమాలో వైలెంట్ గా కనిపించబోతున్నాడు.

ఇప్పటికే సలార్ సినిమాకి సంబందించిన ప్రభాస్ లుక్స్ ని గతంలో రిలీజ్ చేయగా, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అయితే ఆదిపురుష్ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజై, ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోన్న నేపథ్యంలో ఫ్యాన్స్ అంత సలార్ సినిమాపై హోప్స్ అన్ని పెట్టుకున్నట్టు తెల్సుతోంది.

- Advertisement -

ఆదిపురుష్ సినిమా చాలా రోజుల ముందే రిలీజ్ అవ్వాల్సి ఉండగా విఎఫ్ఎక్స్ కారణంగా వాయిదా పడుతూ వచ్చి, జూన్ 16న రిలీజయింది. ఈ సినిమా రిలీజ్ కారణంగానే సలార్ సినిమా అప్డేట్స్ కి కూడా బ్రేక్ పడింది.

సలార్ సినిమా అప్డేట్స్ ఇస్తే ఆదిపురుష్ సినిమాపై ప్రేక్షకులకు నమ్మకం పోతుందనే ఉద్దేశ్యంతో ఇన్నిరోజులు సినిమా గురించి ఏ విధమైన న్యూస్ గాని అప్డేట్స్ గాని ఇవ్వలేదు. అయితే ఇప్పడు ఆదిపురుష్ రిలీజ్ అయిపోవడంతో సలార్ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి మూవీ టీం ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం

ఇప్పటికే సలార్ సినిమాకి సంబంధించి టీజర్ కూడా కట్ చేసి రెడీగా ఉంచారట. జులై మొదటి వారంలో ఆదిపురుష్ సినిమాతో పాటు థియేటర్స్ లో సలార్ టీజర్ ని స్క్రీనింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ విషయం ఆ నోటా, ఈ నోటా పాకి ప్రభాస్ ఫ్యాన్స్ వరకు వెళ్ళింది. దాంతో డార్లింగ్ ఫ్యాన్స్ అంత ఆదిపురుష్ సినిమాని మర్చిపోండి. సలార్ సినిమా టీజర్ ఆన్ ది వే అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు వేస్తూ హల్చల్ చేస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు