Ravi Teja: మరోసారి ధమాకా జోడి – సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా..?

మాస్ మహారాజ రవితేజ, యంగ్ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన ధమాకా సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత హీరోయిన్ శ్రీలీలకి ఆఫర్లు వెల్లువెత్తాయని చెప్పాలి. లక్కీ హీరోయిన్ గా గుర్తింపు పొందిన శ్రీలీల ప్రస్తుతం నిర్మాతలకు, హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. ఈ హిట్ కాంబినేషన్ మరోసారి సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనుందని టాక్ వినిపిస్తోంది. మైత్రి మూవీస్ బ్యానర్ పై దర్శకుడు గోపీచంద్ మలినేని, రవితేజ కాంబినేషన్లో రానున్న సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల పేరుని పరిశీలిస్తున్నట్లు సమాచారం అందుతోంది. గోపీచంద్, రవితేజ కాంబోలో క్రాక్ బ్లాక్ బస్టర్ కాగా, మైత్రి గోపీచంద్ కాంబోలో రీసెంట్ గా వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ కాగా, రవితేజ, శ్రీలీల కాంబోలో ధమాకా రూపంలో బ్లాక్ బస్టర్ ఉన్న క్రమంలో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెరుగుతున్నాయి.

ప్రస్తుతం డైరెక్టర్ కథను సిద్ధం చేస్తున్న ఈ ప్రాజెక్ట్ గురించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని సమాచారం అందుతోంది. ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాల తర్వాత రావణాసుర ద్వారా డిజాస్టర్ అందుకున్న రవితేజ ఆ ప్రభావం ఏమీ లేకుండా వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ లైనప్ లో టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ సినిమాలు ఉన్నాయి. గోపీచంద్ డైరెక్షన్లో రానున్న సినిమాను ఆగస్టు లేదా సెప్టెంబర్ లో స్టార్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్.

ప్రస్తుతం అరడజనుకి పైగా సినిమాలను లైన్లో పెట్టి రెండు షిఫ్ట్ లు వర్క్ చేస్తూ మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్ గా ఉంది శ్రీ లీల. గోపీచంద్, రవితేజ కాంబినేషన్లో వచ్చిన డాన్ శీను, బలుపు, క్రాక్ సినిమాలు మంచి కమర్షియల్ హిట్స్ గా నిలిచిన నేపథ్యంలో ఈ కాంబినేషన్ పై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి. మరి, ఇన్ని రిపీట్ కాంబినేషన్లు ఉన్న ఈ సినిమా విషయంలో సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు