Prabhas: ఆదిపురుష్ సినిమాలో రావణుడి పది తలల గురించి క్లారిటీ ఇచ్చిన నిర్మాత

రామాయణంలో ఆ రాముడికి ఎన్ని కష్టాలొచ్చాయో, ఆ రామాయణం ఆధారంగా తీసిన ఆదిపురుష్ సినిమాకి కూడా అన్ని కష్టాలు, వివాదాలు వస్తోన్నాయి. సినిమా బాగుందని కొంతమంది అంటుంటే, అసలేం బాగాలేదు చరిత్రని వక్రీకరించరంటూ మరికొంత అంటున్నారు. ఎవరేమి అనుకున్న గాని సినిమా మాత్రం థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఇప్పటికే ప్రపంచావ్యాప్తంగా 340 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ దిశగా అడుగులు వేస్తుంది.

ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమాలో కృతి సనన్ సీతగా నటించగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించాడు. అయితే ఈ సినిమాలో రావణుడి పాత్రకి గతంలో రామాయణం ఆధారంగా తీసిన అన్నీ సినిమాల్లోకెల్లా కొత్తగా ఉండేసరికి ప్రేక్షకుల దగ్గరి నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

దాదాపుగా రామాయణం ఆధారంగా తెరకెక్కిన సినిమాలన్నిటిలో రావణుడి 10 తలలు పక్క, పక్కనే ఉంటాయి. అయితే ఆదిపురుష్ సినిమాలో మాత్రం రావణుడి తలలు మాత్రం పైన, కింద ఉండటంతో ఈ విషయం ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది.

- Advertisement -

ఇక ఈ విషయంపై పీపుల్ ఫ్యాక్టరీ సంస్థ ప్రొడ్యూసర్ వివేక్ కూచిభొట్ల స్పందిస్తూ రామాయణంలో రావణుడి తలలు ఎలా ఉంటాయని ఎవరు చూడలేదని, అన్ని సినిమాల్లోకెల్లా వైవిద్యం చూపించాలని ఈ విధంగా డిజైన్ చేస్తే, ఈ విషయాన్ని ఎందుకు వివాదస్పదం చేస్తున్నారని, గతంలోలాగా తీస్తే అప్డేట్ అవ్వండి అని అంటారు, అన్నిట్లోకెల్లా వైవిధ్యం చూపిస్తే ఇదేంటి అని అంటారు ఇలా అయితే సినిమాలు ఎలా తీయాలి అని ఆయన అన్నారు. ఆదిపురుష్ సినిమా చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి అర్ధమయ్యే రీతిలో తెరకెక్కించబడింది అంతేతప్ప ఎవరిని కించపరిచే ఉద్దేశ్యం లేదని ఆయన మీడియాకి వివరించారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు