SPY: వివాదాల మధ్య నిఖిల్ కి పాజిటివ్ పాయింట్ అదేనా..?

కార్తికేయ2 ద్వారా పాన్ ఇండియా హిట్ అందుకున్న హీరో నిఖిల్, గ్యారీ కాంబినేషన్లో రూపొందిన స్పై సినిమా జూన్ 29న రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కి రెండు వారాల సమయం కూడా లేని క్రమంలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది సినిమా యూనిట్. ఇదే అంశం పై హీరోకి, నిర్మాతకి మధ్య విభేదాలొచ్చాయని వార్తలొచ్చాయి. ఓటీటీ ప్లాట్ఫార్మ్ తో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ డేట్ కి రిలీజ్ చేయటమే కరెక్ట్ అని నిర్మాత భావించగా, పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్న ఈ సినిమాను ప్రమోషన్స్ కి పదిరోజుల సమయం కూడా ఇవ్వకుండా రిలీజ్ చేయటం కరెక్ట్ కాదని భావించిన నిఖిల్ మొదట్లో రిలీజ్ డేట్ పోస్టర్ ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేయలేదు.

అయితే, ఆ తర్వాత సినిమా యూనిట్ నచ్చజెప్పడంతో కన్విన్స్ అయిన నిఖిల్ రిలీజ్ డేట్ పోస్టర్ ని షేర్ చేశాడు. నిఖిల్ ఈ రిలీజ్ డేట్ ఒప్పుకోకపోవటానికి కారణం ఆదిపురుష్ సినిమా కూడా కారణం అని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఆదిపురుష్ యుఫోరియా ఉన్న సమయంలో సినిమాను రిలీజ్ చేస్తే వర్కౌట్ కాదని, ఎంతగా ప్రమోట్ చేసినా కూడా జనాల్లోకి సినిమా వెళ్ళాడు అన్నది నిఖిల్ వాదన అని టాక్.

మొత్తానికి ప్రొడ్యూసర్ ఫిక్స్ డేట్ కి వస్తున్న స్పై సినిమాకి ఆదిపురుష్ సినిమా మిశ్రమ స్పందన రావటం కూడా కలిసొచ్చే అంశం అని చెప్పవచ్చు. యూనివర్సల్ రీచ్ ఉన్న సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ డే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే బ్లాక్ బస్టర్ అవ్వటం ఖాయం. మరి, కార్తికేయ తర్వాత స్టోరిల విషయంలో సెలెక్టివ్ గా వెళ్తున్న నిఖిల్ కి స్పై సినిమా రూపంలో మరో బ్లాక్ బస్టర్ అందుతుందా లేదా వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు