Kalki 2898 AD Story : కల్కి స్టోరీ లైన్ ఇదేనా? హాలీవుడ్ కు కూడా పూనకాలే

Kalki 2898 AD Story : కల్కి 2898 ఏడీ మూవీకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ బయటకు వచ్చినా హాలీవుడ్ తో పోలుస్తున్నారు. అయితే తాజాగా బయటకు వచ్చిన ఈ మూవీ స్టోరీ లైన్ వింటే హాలీవుడ్ కు కూడా పూనకాలే అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. మరి కల్కి మూవీ స్టోరీ లైన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కల్కి కథపై హింట్ ఇచ్చిన డైరెక్టర్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన రెండు టీజ‌ర్లు చూస్తే ఈ సినిమా క‌థ మ‌రో గ్రహంలో సాగుతుంద‌ని తెలుస్తోంది. అధునాతన కార్లు, అత్యాధునిక ఆయుధాలు, ఎడారి, వింత దుస్తులు ధరించిన వ్యక్తులు, మధ్యలో ఆంజనేయ స్వామి డాలర్, గుహలో కూర్చున్న వృద్ధుడు ఇలా ఎన్నో సన్నివేశాలు తాజాగా విడుదలైన టీజర్‌లో కనిపిస్తున్నాయి. సినిమా కథ ఏంటి? కథ ఏ సమయంలో జరుగుతుంది? గతంలోని కథనా? లేక భవిష్యత్తు కథనా? అని అభిమానులు అయోమయంలో ఉన్నారు. ఇదిలా ఉంటే దర్శకుడు నాగ్ అశ్విన్ కథ గురించి ఒక చిన్న హింట్ ఇచ్చాడు.

Kalki 2898 AD Update: Trailer Coming Soon - WPO-Daily News and Updates

- Advertisement -

కొద్దిరోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దర్శకుడు నాగ్ అశ్విన్.. సినిమాలో కథ జరిగే సమయం గురించి చెబుతూ.. సినిమా కథ మహాభారతంలో మొదలై క్రీ.శ. 2898 వరకు సాగుతుంది. అంటే దాదాపు 6000 వేల సంవత్సరాల కథ ‘కల్కి 2898 క్రీ.శ.’లో ఉంది అని చెప్పుకొచ్చారు. గతం, భవిష్యత్తు కథ ‘కల్కి 2898 క్రీ.శ.’ సినిమాలో ఉంటుందని ఆయన అన్నారు.

కల్కి స్టోరీ లైన్ ఇదే?

ప్రభాస్ ఈ సినిమాలో ‘భైరవ’ పాత్రలో నటిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఆ భైరవ డబ్బు కోసం నేరస్తులను పట్టుకునే లేదా చంపే బౌంటీ హంటర్ అని సమాచారం. దుర్మార్గుల చేతిలో అష్టకష్టాలు పడుతున్న దీపికా పదుకొణె పాత్ర భైరవతో చేరిన తర్వాత భైరవ ప్రపంచాన్ని రక్షించే పోరాటానికి పూనుకోవడమే సినిమా కథ అని తెలుస్తోంది. ఇది నిజమేనా ? అంటే సినిమా విడుదలైన తర్వాతే కథపై పూర్తి క్లారిటీ వస్తుంది.

బుజ్జి స్పెషల్ అట్రాక్షన్

సినిమాలో బుజ్జి అనే క్యారెక్టర్ ప్రభాస్ కి మెషీన్ ఫ్రెండ్. కీర్తి సురేష్ ఈ మెషిన్ బుజ్జీకి గాత్రదానం చేసింది. సొంతంగా మాట్లాడే, ఆలోచించే ఈ బుజ్జికి భైరవపై సెటైర్లు వేయడమే పని. బుజ్జి, భైరవల టీజర్ మే 22న విడుదలైంది. ఈ చిత్రం జూన్ 27న పలు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

అమితాబ్ పాత్ర మరో హింట్

సినిమాల్లో ఆధునిక యంత్రాలు, సాంకేతికతల వినియోగం చాలా ఎక్కువగా ఉంది. అయితే దానితో పాటు పురాణ పాత్రలు కూడా ఉంటాయి. అమితాబ్ బచ్చన్ పాత్ర గతం, భవిష్యత్తు మధ్య లింక్‌గా పని చేస్తుంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో నటుడు కమల్ హాసన్ కనిపించినట్లు సమాచారం. దీపికా పదుకొణె, దిశా పటాని ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. భైరవ అనే యోధుడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు