Manjummel Boys and Ilayaraja Controversy : ఇళయరాజా నోటీసులు… మంజుమ్మెల్ బాయ్స్ టీం రిప్లై ఇదే

Manjummel Boys and Ilayaraja Controversy :మలయాళ బ్లాక్ బస్టర్ మంజుమ్మెల్ బాయ్స్ సినిమాలో తన పాటను వాడుకున్నందుకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా ఆ చిత్రబృందానికి లీగల్ నోటీసులు పంపాడన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ విషయంపై మంజుమ్మెల్ బాయ్స్ నిర్మాతలు స్పందించారు.

వివాదం ఏంటంటే?

చిదంబరం దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం మంజుమ్మెల్ బాయ్స్ ఈ ఏడాది సంచలన విజయం సాధించింది. గుణ సినిమాలోని కన్మణి అన్బోడు కాధలన్ (ప్రియతమా నీవచట కుశలమా) అనే పాటను కూడా ఈ చిత్రం ఉపయోగించుకుంది. అయితే అదే ఇప్పుడు మేకర్స్‌కు సమస్యలను తెచ్చి పెట్టింది.

మంజుమ్మెల్ బాయ్స్ నిర్మాతల రిప్లై

ప్రియతమా నీవచట కుశలమా అనే పాటను ఉపయోగించడానికి తన నుండి అనుమతి తీసుకోనందుకు లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా మంజుమ్మెల్ బాయ్స్ మేకర్స్‌ కు లీగల్ నోటీసు జారీ చేశారు. తాజా సమాచారం ప్రకారం కాపీరైట్ కలిగి ఉన్న రెండు సంగీత సంస్థల నుండి పాట హక్కులను పొందినట్లు చిత్ర నిర్మాతలలో ఒకరైన షాన్ ఆంటోని స్పష్టం చేశారు. మరి ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి.

- Advertisement -

ఇళయరాజా నోటీసుల్లో ఏముందంటే?

మంజుమ్మెల్ బాయ్స్ నిర్మాతలకు కాపీరైట్ ఉల్లంఘనపై ఇళయరాజా లీగల్ నోటీసు జారీ చేశారు. కమల్ హాసన్ నటించిన గుణలోని పాట మంజుమ్మెల్ బాయ్స్ చిత్రంలో ఇంట్రడక్షన్ కార్డ్‌లో, సినిమా క్లైమాక్స్ కోసం కూడా ఉపయోగించారు.

అయితే ఇళయరాజా పంపిన నోటీసుల్లో ఆ చిత్రం కాపీ రైట్‌లను మరో రెండు కంపెనీలు కలిగి ఉన్నప్పటికీ, ఇళయరాజా తన అసలు సంగీత రచనలన్నింటికీ మొదటి యజమాని అని పేర్కొన్నారు. అతను తన రచనలపై సంపూర్ణ హక్కులను కలిగి ఉన్నాడని,  పాటను ఉపయోగించడానికి ముందు మేకర్స్ తనకు తెలియజేయలేదని లేదా తన అనుమతిని కోరలేదని అన్నారు. క్రెడిట్స్‌లో తన పేరును ఉదహరించడం అనుమతి కోరినట్లుగా పరిగణించబడదని ఆ నోటీసుల్లో ఉంది.

ఇళయరాజా పోరాటం

ఇళయరాజా గతంలో తన పాటలను ఉపయోగించిన ఇతర చిత్రాలకు సంబంధించి ఇలాంటి వాదనలను కోర్టుకు తీసుకురావడం గమనించదగ్గ విషయం. అనేక సందర్భాల్లో సంగీత సంస్థ నుండి హక్కులు పొందిన తరువాత సినిమాల్లో సంగీతాన్ని ఉపయోగించుకోవచ్చని కోర్టు నిర్ణయించింది. స్వరకర్తకు పాటలపై ప్రత్యేక హక్కు లేదని చెప్పింది. కానీ ఇళయరాజా మాత్రం ఆ తాను క్రియేట్  చేసిన పాటలపై తనకే హక్కు ఉంటుంది అంటూ కోర్టులో చాలాకాలంగా పోరాడుతున్నారు. ఆయన తీరును చూసి సంగీత ప్రియులు కూడా మండిపడుతున్నారు.

చిదంబరం దర్శకత్వం వహించిన మంజుమ్మెల్ బాయ్స్ మలయాళ భాషలో రూపొందిన సర్వైవల్ థ్రిల్లర్. ఈ చిత్రంలో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్. పొదువాల్, లాల్ జూనియర్ , దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్, అరుణ్ కురియన్, ఖలీద్ రెహమాన్ ఇంకా చాలా మంది నటులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం 2006లో కొడైకెనాల్‌లో జరిగిన ఒక నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు