Pan India Movies: సౌత్ టు నార్త్.. నార్త్ టు సౌత్… సత్తా చాటే ముద్దుగుమ్మలు ఎవరు..?

Pan India Movies.. ఒకప్పుడు తెలుగు సినిమాలంటే బాలీవుడ్ వాళ్లకి చిన్నచూపు. కానీ ఎప్పుడైతే బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటడం మొదలు పెట్టాయో ఇప్పుడు అందరి దృష్టి తెలుగు సినిమాలపైనే..ఈ క్రమంలోనే ఒకప్పుడు సౌత్ హీరోయిన్లు బాలీవుడ్ లో నటిస్తూ క్రేజ్ సంపాదించుకుంటుంటే ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్స్ కూడా సౌత్ ఇండస్ట్రీలో నటించి సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు.. మరి ఇక్కడ వాళ్ళు అక్కడ..అక్కడ వాళ్ళు ఇక్కడ.. ఎవరు ఏ విధంగా సత్తా చాటుతున్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

Pan India Movies: South to North.. North to South... Who are the cuties to proove them talents.?
Pan India Movies: South to North.. North to South… Who are the cuties to proove them talents.?

తెలుగు వైపు దృష్టి..

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా ఎక్కువగా నడుస్తున్న నేపథ్యంలో హిందీలో అగ్ర కథానాయికలుగా కొనసాగుతున్న ఎంతోమంది హీరోయిన్లు ఇప్పుడు దక్షిణాది హీరోలతో కలిసి జతకట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరొకవైపు పాన్ ఇండియా ట్రెండ్ తో మన కథానాయికలు కూడా ప్రతిభ బలంగా వెలుగులోకి రావడం.. వాళ్లకి అన్ని భాషల్లోనూ అభిమానులు ఏర్పడుతుండడంతో పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నారు.. ఈ పరిణామాలతోనే ఎప్పటికప్పుడు తెరపై కొత్త కలయికలు దర్శనమిస్తున్నాయి.. ఇక ఇప్పుడు అందులో భాగంగానే జాన్వీ కపూర్ , దీపికా పదుకొనే ,కియారా అద్వానీ, దిశాపటాన్ని లాంటి చాలామంది భామలు తెలుగు సినిమాలతో తెరపై సందడి చేయనున్నారు.. తెలుగు పరిశ్రమ నుంచి రూపొందిస్తున్న పాన్ ఇండియా సినిమాలలో వీరంతా అవకాశాలను అందుకున్నారు.. అంతకుముందు ఆలియా భట్ , అనన్య పాండే కూడా సందడి చేసిన విషయం తెలిసిందే.. ఆలియా భట్ ఆర్ ఆర్ ఆర్ సినిమాలో సందడి చేస్తే.. అనన్య పాండే లైగర్ సినిమాలతో సందడి చేశారు..

దీపికా పదుకొనే, దిశా పటానీ:

కల్కి 2898AD సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనేతో పాటు దిశా పటానీ కూడా పరిచయం కానున్నారు. ముఖ్యంగా వీళ్ళ అందం ఆ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ కానుంది

- Advertisement -

కియారా అద్వానీ:

అలాగే రాంచరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా అద్వానీ నటిస్తోంది. ఇప్పటికే భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలలో అలరించిన ఈమె ఇప్పుడు గేమ్ ఛేంజర్ సినిమాలో కూడా నటిస్తోంది..

జాన్వీ కపూర్:

జాన్వీ కపూర్ కూడా దేవర సినిమాతో తొలిసారి తెలుగు తెరకు పరిచయం కానుంది.. ఎన్టీఆర్ సరసన ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటిస్తోంది.. అలాగే రామ్ చరణ్ , బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కూడా జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపిక అయింది..

హిందీ చిత్రాలపై దృష్టి..

సౌత్ సినీ ఇండస్ట్రీలో సత్తా చాటిన సాయి పల్లవి , రష్మిక, పూజా హెగ్డే, కీర్తి సురేష్ , సమంత వీళ్లంతా కూడా దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా చలామణి అయి ఇప్పుడు బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటున్నారు..

పూజా హెగ్డే:

పూజా హెగ్డే ఎప్పటి నుంచో హిందీలో నటిస్తున్నా.. దక్షిణాది హీరోయిన్ గానే గుర్తింపు తెచ్చుకుంది.. ఆమెకి ఎక్కువ విజయాలు తెలుగులోనే లభించాయి.. ప్రస్తుతం షాహిద్ కపూర్ తో కలిసి దేవా అనే సినిమాలో నటిస్తోంది..

కీర్తి సురేష్:

మరొకవైపు కీర్తి సురేష్ బేబీ జాన్ అనే చిత్రంతో పరిచయం అవుతోంది.

రష్మిక:

ఇటీవలే యానిమల్ చిత్రంతో మంచి పేరు దక్కించుకున్న రష్మిక ఇప్పుడు సికిందర్ , ఛావా చిత్రాలలో నటిస్తోంది.

సాయి పల్లవి:

సాయి పల్లవి కూడా రామాయణ సినిమాలో అవకాశాన్ని అందుకుంది.. ఇక ఇందులో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు.. మరొకవైపు అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా వస్తున్న సినిమాలో కూడా సాయి పల్లవి అవకాశాన్ని దక్కించుకుంది.

వీరితోపాటు తమన్నా, రాశిఖన్నా, నయనతార, సమంతలు కూడా హిందీ సినిమాలపై ఒక కన్నేసి ఉంచారు.మరి వీరిలో ఎవరు ఏ ఇండస్ట్రీలో సక్సెస్ అవుతారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు