Hollywood vs Tollywood : కల్కీ కష్టాలు ఇప్పట్లో తగ్గేలా లేవుగా… అప్పుడు డూన్ ఇప్పుడు మ్యాడ్ మాక్స్

Hollywood vs Tollywood : ఇండియాలోనే అత్యంత కాస్ట్లీ బడ్జెట్ మూవీగా రూపొందుతున్న కల్కి 2898 ఏడీ మూవీ కష్టాలు ఇప్పట్లో తగ్గేలా కన్పించడం లేదు. ఓ వైపు ఈ మూవీ కోసం బుజ్జి అనే ఫ్యూచరిస్టిక్ కార్ ను తయారు చేశారని మనం సంబరాలు చేసుకుంటుంటే మరోవైపు హాలీవుడ్ మ్యాడ్ మ్యాక్స్ నుంచి పోలికలు పెడుతున్నారు నెటిజన్లు.

బుజ్జీ వర్సెస్ మ్యాడ్ మ్యాక్స్

ప్రకటించినప్పటి నుంచే నాగ్ అశ్విన్‌తో ప్రభాస్ చేయబోయే సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సినిమా విడుదలకు కేవలం ఒక నెల మాత్రమే మిగిలి ఉండడంతో కల్కి 2898 ఏడీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ప్రమోషనల్ కార్యక్రమాలలో భాగంగా ఇటీవల చిత్ర నిర్మాతలు హైదరాబాద్‌లో ఈ చిత్రం కోసం భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అందులో ప్రభాస్ భైరవ పాత్రలో దర్శనం ఇచ్చిన అభిమానుల్లో జోష్ పెంచాడు. ఇంకా మేకర్స్ బుజ్జిని కూడా పరిచయం చేశారు. దీంతో ఆ కారును చూసి టాలీవుడ్ తో సహ ఇండియన్ మూవీ లవర్స్ అబ్బురపడిపోతుంటే, మరోవైపు మ్యాడ్ మ్యాక్స్ తో పోలికలు పెడుతూ కామెంట్స్ చేస్తున్నారు.

Image

- Advertisement -

ఇలాంటి బుజ్జీలను మ్యాడ్ మ్యాక్స్ కోసం వందల్లో తయారు చేశారు అంటూ మ్యాడ్ మ్యాక్స్ సిరీస్ లో వాడిన ఆధునాతనమైన వాహనాల ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. అంతకంటే ముందే కల్కి లుక్ రిలీజ్ అయినప్పుడు కూడా ఇదే పరిస్థితి. హాలీవుడ్ పాపులర్ మూవీ డ్యూన్ లుక్ లా కల్కి మెకోవర్ ఉందంటూ కామెంట్స్ విన్పించాయి. మరి సినిమా రిలీజ్ అయితే ఇంకెలా ఉంటుందో కల్కి పరిస్థితి. ఇంకెన్ని పోలికలు పెడతారో ? ఏదేమైనా ఒక టాలీవుడ్ సినిమాతో హాలీవుడ్ ను పోలుస్తున్నారు అంటే అది మన తెలుగు మేకర్స్ సాధించిన అరుదైన ఘనత అని ఎవ్వరైనా ఒప్పుకొని తీరాల్సిందే.

బుజ్జి ప్రత్యేకతలు

కోయంబత్తూర్‌లోని జయం మోటార్స్‌తో కలిసి ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారులు మహీంద్రా ఈ చిత్రానికి బుజ్జి అనే కారును కస్టమైజ్ చేసి ఇచ్చారు. ఈ చిత్రంలో బుజ్జిని స్వయంగా ప్రభాస్ పాత్ర భైరవ తన చేతితో నిర్మిస్తారు. ఈ అద్భుతమైన నారింజ కలర్ బీస్ట్ 6 టన్నుల బరువు ఉందని, శక్తి 94 కిలోవాట్లకు సమానమని తెలిసింది. ఈ కారు 9800 న్యూటన్-మీటర్ల టార్క్ కలిగి ఉందని సమాచారం. ఇది ఒక కమర్షియల్ కారు కంటే చాలా ఎక్కువ. ఇంకా బుజ్జి 47 కిలోవాట్-అవర్ బ్యాటరీని కలిగి ఉందని తెలుస్తోంది.

Kalki 2898 AD: Everything to know about Prabhas' car Bujji from Nag  Ashwin's sci-fi flick; kerb weight to torque | PINKVILLA

కారు చక్రాల విషయానికి వస్తే, బుజ్జికి మూడు టైర్లు ఉన్నాయి. ముందు రెండు, వెనుక ఒకటి. వెనుక ఉన్న చక్రం గోళాకారంగా ఉంటుంది. వాహనం ఏ దిశలోనైనా కదలడానికి ఈ టైర్ వీలు కల్పిస్తుంది. ముందు టైర్లు 34.5 అంగుళాల రిమ్ పరిమాణంలో ఉంటాయి. పొడవు 6075 mm, వెడల్పు 3380 mm, ఎత్తు 2186 mm.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడీ మూవీలో ప్రభాస్ తో పాటు దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ , దిశా పటానీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ జూన్ 27న థియేటర్లోకి రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు