Anup Rubens: మ్యూజిక్ డైరెక్టర్ గా మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు

Anup Rubens: తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ లో అనూప్ రూబెన్స్ ఒకరు. జై సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు అనూప్. మొదటి సినిమాతోనే మ్యూజిక్ డైరెక్టర్గా మంచి గుర్తింపు సాధించుకొని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో స్థిరపడిపోయాడు. అయితే ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ ఉన్నాయి. అద్భుతమైన ఫీల్ ఉన్న టూన్స్ ను అనూప్ అందిస్తూ ఉంటాడు. వరుసగా సినిమాలు చేస్తున్న తరుణంలో విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఇష్క్ సినిమా పాటలు మంచి బ్రేక్ ను తీసుకొచ్చాయి.

Ishq Movie

అనూప్ కి బ్రేక్ ఇచ్చిన సినిమాలు

నితిన్ కి వరుస డిజాస్టర్ సినిమాలు పడుతున్న టైంలో విక్రం కే కుమార్ దర్శకత్వంలో ఇష్క్ అనే సినిమాను చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచి మంచి కం బ్యాక్ ఫిలిం అయింది. ఈ సినిమాకి అనుప్ అందించిన సాంగ్స్ అద్భుతం అని చెప్పొచ్చు. సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ పెంచాయి. ఆ తర్వాత నితిన్ హీరోగా చేసిన గుండెజారి గల్లంతయ్యిందే సినిమా పాటలు కూడా అద్భుతమైన హిట్ అయ్యాయి. వరుసగా సినిమాలు చేసుకుంటూ కెరియర్లో సక్సెస్ఫుల్ ముందుకు సాగాడు అనూప్.

- Advertisement -

అనూప్ ఆల్ టైం హిట్

ప్రతి దర్శకుడు కూడా తన కెరియర్లో బెస్ట్ ఆల్బమ్ అంటూ ఒకటి ఉంటుంది అలా అనూప్ విషయానికి వస్తే. మనం సినిమా బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అని చెప్పొచ్చు. మనం సినిమా అక్కినేని ఫ్యామిలీకి ఎంత స్పెషల్ అలానే అనూప్ కి ఈ సినిమా అంత స్పెషల్. ఈ సినిమాలోని ప్రతి ట్యూన్ కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంది.

స్టార్ హీరోస్ తో

అనూప్ తన కెరీర్లు ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందించాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన టెంపర్ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హీట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలో అనూప్ అందించిన ట్యూన్స్ కూడా అంతే ప్లస్ అయ్యాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు అనే సినిమాకి కూడా అనూప్ సంగీతం అందించాడు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచింది. ఇక ఈ మధ్యకాలంలో అనూప్ సంగీతంలో సినిమాలేవి కూడా పెద్దగా రిలీజ్ కాలేదు.

అనూప్ లైనప్

ఇక ప్రస్తుతం అనూప్ మంచి లైనప్ సెట్ చేసాడు. వరుస సినిమాలతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వనున్నాడు. ప్రస్తుతం యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా తీస్తోన్న పాన్ ఇండియా మూవీకి, గౌరీ రోనంకి తీస్తోన్న సినిమాకి, ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోన్న ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నారు. వీటితోపాటు సుమంత్ హీరోగా సంతోష్ తెరకెక్కిస్తున్న సినిమాకు, ఆది సాయి కుమార్‌తో కృష్ణ ఫ్రమ్ బృందావనం సినిమాకు, విజయ్ కొండ దర్శకత్వంలో ఆకాష్ పూరి నటిస్తున్న సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు