Ashika Ranganath: మెగాస్టార్ తో స్క్రీన్ షేర్.. అదృష్టం అంటున్న యంగ్ బ్యూటీ..!

Ashika Ranganath.. మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా డిజాస్టర్ తర్వాత నటిస్తున్న చిత్రం విశ్వంభర.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వశిష్ట మల్లిడి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తూ ఉన్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటోంది. అయితే ఈ చిత్రంలో నటించే హీరోయిన్స్ విషయంలో ఎప్పటికప్పుడు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే హీరోయిన్ గా త్రిష మాత్రమే నటిస్తున్నట్లు చిత్ర బృందం తెలియజేశారు. కానీ ఇతర నటీనటుల గురించి మాత్రం ఏ విధమైనటువంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ విశ్వంభర సినిమా పైన ఏవో ఒక రూమర్సు వినిపిస్తూనే ఉంటాయి.

చిరంజీవితో ట్రావెల్ చేయడానికి సర్వం సిద్ధం..

Ashika Ranganath: Screen share with Megastar.. Lucky young beauty..!
Ashika Ranganath: Screen share with Megastar.. Lucky young beauty..!

ఇప్పుడు తాజాగా హీరోయిన్ ఆషికా రంగనాథ్ కూడా ఒక లీడ్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలియజేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది.. ఆశికా రంగనాథ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ విధంగా చెప్పుకొచ్చింది.. నేను చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాను కానీ ఆయన సరసన కాదు.. ఆయన పక్కన ఆయనతో ట్రావెల్ చేసే క్యారెక్టర్ లో నటిస్తున్నాను.గ్రీన్ స్క్రీన్‌తో కూడిన సెట్‌లో నేను పని చేయడం ఇదే మొదటిసారి. ఇలా పని చేయడానికి ఎన్నో విషయాలు తెలియాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలోనే నాకు సెట్‌లో ఎన్నో విషయాలు వివరించడానికి సమయం కేటాయించినందుకు చిరంజీవి సార్‌కి ధన్యవాదాలు. అంటూ చెప్పుకొచ్చింది ఆషికా..

Ashika Ranganath: Screen share with Megastar.. Lucky young beauty..!
Ashika Ranganath: Screen share with Megastar.. Lucky young beauty..!

ఆషికా రంగనాథ్ కెరియర్..

కన్నడ ప్రాంతానికి చెందిన హీరోయిన్ అయినప్పటికీ తెలుగులో కూడా పలు సినిమాలలో నటిస్తోంది. మొదట అమీగోస్ సినిమాలో కూడా నటించిన ఆషికా రంగనాథ్ ఆ తర్వాత నాగార్జునతో కలిసి నా సామి రంగ సినిమాలో కూడా నటించింది. ఇప్పుడు చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో కీలకమైన పాత్రలో నటించడంతో కచ్చితంగా ఈమె తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ ముద్ర వేసుకుంటుందని అభిమానులు సైతం తెలియజేస్తున్నారు. మరొక వైపు ఆషికా రంగనాథ్ తెలుగులోనే కాకుండా తమిళ్ , కన్నడ వంటి భాషలలో కూడా నటిస్తోంది. కన్నడలో ఇటీవలే O2 వంటి చిత్రంలో కూడా నటించింది. ఇందులో ఈమె డాక్టర్ గా కనిపించి ప్రశంసలు అందుకుంది. మరి విశ్వంభర సినిమా ఏ మేరకు ఈ ముద్దుగుమ్మకు కలిసి వస్తుందో చూడాలి.

- Advertisement -

విశ్వంభర నటీనటులు..

విశ్వంభర సినిమాలో త్రిషతో పాటు మీనాక్షి చౌదరి, కునాల్ కపూర్ , ఇషా చావ్లా ఇతరత్రా నటీనటులు కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.. ఇక వీరితోపాటు ఆషికా రంగనాథ్ కూడా ఇప్పుడు నటిస్తూ ఉండడంతో ఈ సినిమాలో మరెంత మంది నటిస్తారు అంటూ అభిమానులు ఆశ్చర్యంగా ఎదురుచూస్తున్నారు. యు వి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. ఈ సినిమా మొత్తం సోషియో ఫాంటసీ డ్రామా చిత్రంగా ఉండబోతుందని ఇదివరకే చిత్ర బృందం కూడా వెల్లడించారు. విశ్వంభర సినిమా రిలీజ్ డేట్ విషయం పైన కూడా చిత్ర బృందం వచ్చే ఏడాది విడుదలకు సిద్ధమన్నట్లుగా తెలియజేసింది. ఇక ఇందులో కుష్బూ కూడా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు