Prasanth Neel: పాన్ ఇండియా సినిమాకి పాన్ ఇండియా హీరోయిన్ ని సెట్ చేసాడు

Prasanth Neel: ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ డైరెక్టర్స్ లో ప్రశాంత్ నీల్ ఒకరు.
కే జి ఎఫ్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఒక దర్శకుడుగా మంచి గుర్తింపు ప్రశాంత్ కి లభించింది. అంతకుముందు కన్నడ సినిమా అంటే పెద్దగా పట్టించుకోని తెలుగు ప్రేక్షకులు కేజీఎఫ్ సినిమా తర్వాత ఆ సినిమాలు కూడా చూడటం మొదలుపెట్టారు. అలా కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో వచ్చిన కాంతారా సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది.

Kgf
కే జి ఎఫ్ సినిమాతో మార్క్ సెట్ చేశాడు

ప్రశాంత్ నీళ్ కే జి ఎఫ్ సినిమా చూసిన తర్వాత చాలామంది ఆశ్చర్యపోయారు. ఒక సినిమాని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎంతలా ఎలివేట్ చేయొచ్చు ఈ సినిమా లో చూపించాడు ప్రశాంత్. అలానే తల్లి కొడుకులు మధ్య ఎమోషన్ కూడా పీక్ లో చూపించాడు. తెలుగు ప్రేక్షకులు ఇష్టపడే ఒక మాస్ కమర్షియల్ సినిమాను తన పంథాలో చూపించాడు. ఈ సినిమా తర్వాత సీక్వెల్ గా కే జి ఎఫ్ టు అనే సినిమా కూడా వచ్చింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బీభత్సంగా హిట్టై దాదాపు 1000 కోట్లకు పైగా వసూలు చేసింది.

ప్రభాస్ కి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు

ఇకపోతే ప్రశాంత్ ని తెలుగు హీరోలను కూడా లైన్ లో పెట్టాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయి గుర్తింపును సాధించుకున్నాడు ప్రభాస్. ఆ సినిమా తర్వాత వచ్చిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ కి గురయ్యాయి. కానీ ప్రశాంత్ నేను దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా ప్రభాస్ కి మంచి కం బ్యాక్ అయింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా దాదాపు అంచనాలకు రీచ్ అయిపోయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించి కలెక్షన్స్ ను రాబట్టింది. ఇకపోతే ఈ సినిమాకి సీక్వెల్ గా కూడా సినిమా రానున్నట్లు అఫీషియల్ గానే అనౌన్స్ చేశారు.

- Advertisement -

ఎన్టీఆర్ కి హీరోయిన్ ని సెట్ చేశాడు

ప్రశాంత్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తన 31 వ సినిమాను చేస్తున్నట్లు రెండు సంవత్సరాల క్రితమే అనౌన్స్మెంట్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ కు ఉన్న కమిట్మెంట్స్ వలన ఆ ప్రాజెక్ట్ కాస్త డిలే అవుతూ వచ్చింది. ఇకపోతే త్వరలో ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ కి ఉన్న మాస్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ మాస్ ఇమేజ్ ని ప్రశాంత్ ఎంతవరకు ఎలివేట్ చేస్తాడు అనేది చాలామందికి క్యూరియాసిటీ ఉంది. ఇకపోతే ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా రష్మిక ను ప్రశాంత్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించిన అధికారక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు