JR Amitabh Bachchan : అమితాబ్ బచ్చన్ వేషధారి (డూప్) ఫిరోజ్ ఖాన్ ఆకస్మిక మరణం..

JR Amitabh Bachchan : బాలీవుడ్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ డూప్ ఫిరోజ్ ఖాన్ అంటే తెలీని వారుండరు. “భాబీ జీ ఘర్ పే హై” మరియు “జీజా జీ ఛత్ పర్ హై” వంటి పలు టీవీ షోలలో నటించి పాపులర్ అయ్యాడు. అమితాబ్ బచ్చన్ పోలికలతో ఉన్న ఈ నటుడు జూనియర్ అమితాబ్ బచ్చన్ గా బుల్లితెరపై పాపులర్ అయ్యాడు. అయితే తాజా సమాచారం ప్రకారం నటుడు ఫిరోజ్ ఖాన్ గురువారం నాడు (మే 23) గుండెపోటుతో మరణించినట్లు సమాచారం. సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌ (JR Amitabh Bachchan) ను అనుకరించడంలో పేరుగాంచిన నటుడు ఫిరోజ్ ఖాన్ గుండెపోటుతో గురువారం రోజున ఉత్తరప్రదేశ్‌లోని ‘బదౌన్‌’ లో మరణించినట్లు ఇండియా టీవీ నివేదించింది. ఈ విషయంపై అతని స్నేహితుడు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో వార్తలను కంఫర్మ్ చేసారు. అనేక అనేక టీవీ షోలలో నటించిన ఫిరోజ్ ఖాన్ పలు పాత్రలలో నటించగా, అమితాబ్ బచ్చన్‌ను ఎక్కువగా అనుకరిస్తూ ప్రదర్శనలు ఇచ్చాడు.

Junior Amitabh Bachchan impersonator Feroze Khan passes away

గుండెపోటుతో మరణించిన ఫిరోజ్ ఖాన్ :

ఇక ఫిరోజ్ ఖాన్ మరణ వార్తను తన స్నేహితుడైన దుర్గా రహిక్వార్ ఇంస్టాగ్రామ్ లో తెలియచేసారు. ఇక షారుఖ్ ఖాన్‌ను అనుకరించడంలో పేరుగాంచిన దుర్గా రహిక్వార్, ఫిరోజ్ మరణ వార్తను ఇన్‌స్టాగ్రామ్ రాస్తూ, “ఆజ్ హమారే బీచ్ ఫిరోజ్ ఖాన్ భాయిజాన్ నహీ రహే” అంటే.. (జూనియర్ అమితాబ్ బచ్చన్ అని పిలవబడే ఫిరోజ్ ఖాన్ ఇప్పుడు మాతో లేరు)” అంటూ అతను మరియు ఫిరోజ్ ఒక కార్యక్రమంలో కపిల్ శర్మతో కలిసి పోజులిచ్చిన పాత చిత్రాన్ని కూడా పోస్ట్ చేసి పంచుకున్నాడు. ఇక ఫిరోజ్ ఖాన్ కొంతకాలం బదౌన్‌లో ఉన్నాడని ఇండియా టీవీ నివేదిక పేర్కొంది. మరియు అక్కడ పలు ఈవెంట్స్‌ లో కూడా పాల్గొన్నారు. అతను సోషల్ మీడియా కోసం రీల్స్ తయారు చేయడంలో కూడా బిజీగా ఉన్నాడని తెలిసింది. మే 4న బదౌన్ క్లబ్‌లో జరిగిన ఓటర్ మహోత్సవ్‌లో అమితాబ్ వేషధారణలో పాల్గొని ప్రేక్షకులను అలరించాడు. ఆ తర్వాత పెద్దగా ఎక్కడా ప్రోగ్రామ్స్ చేయలేదు. ఇక ఫిరోజ్ ఖాన్ అంత్యక్రియలు బదౌన్‌ లో జరుగుతాయని సమాచారం.

- Advertisement -

బుల్లితెర కెరీర్..

ఇక ఫిరోజ్ ప్రధానంగా అమితాబ్‌ (JR Amitabh Bachchan) ను అనుకరించడంలో ప్రసిద్ది చెందాడు. అయితే అతను టీవీ షోలలో ‘భాబీ జీ ఘర్ పే హై’ తో మొదట గుర్తింపు పొందాడు. ఆ తర్వాత “జిజా జీ ఛత్ పర్ హై”, “సాహెబ్ బీబీ ఔర్ బాస్”, “హప్పు కి ఉల్తాన్ పల్తాన్” మరియు “శక్తిమాన్” వంటి షోలలో కూడా పనిచేశాడు. ఇక అద్నాన్ సమీ యొక్క సూపర్‌హిట్ పాట “థోడి సి తు లిఫ్ట్ కరా దే” లో కూడా ఫిరోజ్ నటించారు. ఇక చనిపోవడానికి ఒక రోజు ముందు బుధవారం నాడు ఫిరోజ్ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్‌ను పంచుకున్నాడు, అందులో అతను కూలీ నుండి అమితాబ్ లాగా దుస్తులు ధరించాడు. 2013లో ది బిగ్ ఇండియన్ పిక్చర్‌ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఫిరోజ్ ఖాన్ అమితాబ్‌ను అనుకరించినప్పుడు తనకు 15 ఏళ్లు అని వెల్లడించాడు. దీవార్ సినిమా అతని ని అలా ప్రేరేపించిందని, అతను పాన్ షాప్ వద్ద ఆగి, అమితాబ్ వాయిస్‌లో పాన్ అడిగేవాడని అన్నాడు. అప్పట్నుంచే అమితాబ్ లా వేషం వేసి ఈవెంట్‌లు మరియు పాఠశాలలో అమితాబ్ లా నటించానని ఫిరోజ్ ఖాన్ చెప్పుకొచ్చాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు